Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఎలా అయినా నా డాక్టర్ బాబుని సొంతం చేసుకుంటాను అంటూ దీప కార్తీక్ దగ్గరికి బయలుదేరుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప వాళ్ళ అన్నయ్య ఇంటి నుంచి వెళ్లిపోతుండడంతో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు దీప కూడా వాళ్లను చూసి మరింత బాధపడి తప్పదు అన్నట్టు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అప్పుడు డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ ఆ మోనిత నిన్ను ఏం చేస్తుందో అని అనగా అది నన్ను ఏమి చేయలేదు అంటూ దీప ధైర్యం చెబుతుంది.
మరొకవైపు సౌందర్య, హిమ రేపు నీ పుట్టినరోజు కదా కొత్త బట్టలు తెచ్చుకో అని అనడంతో అప్పుడు వెంటనే హిమ నాకు కొత్త బట్టలు వద్దు నేను పుట్టిన రోజు జరుపుకోను అని అంటుంది. నాకేమీ వద్దు అదే డబ్బుతో అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ఏదైనా తెచ్చి ఇద్దామనడంతో ఆనందరావు హిమని మెచ్చుకుంటాడు. అప్పుడు వారు సౌర్య గురించి తలుచుకొని కాసేపు బాధపడుతూ ఉంటారు.
ఇప్పుడు హిమ నా వల్లే సౌర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని బాధపడుతున్నాడంటూ సౌందర్య అలా ఏం కాదు అని హిమను ఓదారుస్తుంది. మరొకవైపు కార్తీక్ డ్రైవర్ శివ తో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శివ సార్ మీరు అందరి పేర్లు మర్చిపోతారు కదా మరి ఆ వంటలకు పేరు ఎందుకు గుర్తు పెట్టుకున్నారు అని అనడంతో వెంటనే శివకు బిర్యానీ వాసన రావడంతో కార్తీక్ చెప్పగా కార్తీక్ కూడా బిర్యానీ వాసన బాగా వస్తుంది అని అంటాడు.
శివ కార్తీక్ కలసి మూలిత దగ్గరికి వెళ్లి బిర్యాని వాసన వస్తుంది అంటూ ఆ బిర్యానీ వాసన వచ్చే వైపు నడుచుకుంటూ వెళ్తారు. తీరా అక్కడ చూస్తే దీప కనిపించేసరికి మోనిత షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్ మా ఇంట్లో వంట చేయడానికి రా అంటూ దీప ని పిలవడంతో మోనిత ఎందుకు అంటూ గట్టిగా అరుస్తుంది.
దీప కూడా తాను రాను అని కానీ మీకు కావాల్సినప్పుడల్లా వండి పెడతాను అని కార్తీక్ తో అంటుంది. ఆ తర్వాత మోనిత, కార్తీక్ మీ అక్కడి నుంచి పంపించి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ దీప ను గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు దీప ధైర్యంగా అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అంటూ ధైర్యంగా మాట్లాడుతుంది దీప. కార్తీక్ ఇంటికి వెళ్లినా కూడా దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో దీప ప్రేమగా డాక్టర్ బాబుకి బిర్యానీ వడ్డించడంతో కార్తీక్ కూడా సంతోషంగా తింటూ ఉంటాడు. అది చూసి మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.