MAA Elections 2021 Results : తెలుగు సినీపరిశ్రమలో మా ఎన్నికలు వాడివేడీగా కొనసాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ఎన్నికలు రావరావణ యుద్ధంలా తలపిస్తందని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు.
విష్ణు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ఆయన ఆకాంక్షించారు. మా సభ్యుల ఆశీస్సులు విష్ణుకు ఉన్నాయన్నారు. 883 మంది సభ్యుల బలమే నా బలమని చెప్పారు. మరోవైపు ఓటేసేందుకు ఢిల్లీ నుంచి నటి జయప్రద వచ్చారు. ఈ సందర్భంగా జయప్రదకు మోహన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. మేమంతా ఒకే కుటుంబమని ఆమె అన్నారు.
మా ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ‘మా ఎన్నికలు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి క్షణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలవరకు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 276 ఓట్లు నమోదయ్యాయి.
సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మా ఎన్నికల ఫలితాలను కూడా ఈరోజే ప్రకటించనున్నారు. సోమవారం ఫలితాలను ప్రకటించాలని భావించినప్పటికీ నిర్ణయం మార్చుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మా ఎన్నికల సమయంలో ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మీడియా ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్ భుజంపై చేయివేసి మంచు విష్ణు మాట్లాడారు. అంతా బాగానే ఉందని సంకేతాలిచ్చారు.
ఇక కొందరు ప్రముఖ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ జాబితాలో ఉన్న కొందరు ప్రముఖుల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఉన్నారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world