Krithi Shetty : బేబమ్మ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. బేబమ్మ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కృతిశెట్టి.. హోమ్లీ లుక్‌లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది అందరిని ఆకట్టుకుంది. నీ నవ్వు నీలి సముద్రం.. ఈ పాటతో కుర్ర కారు గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చింది. ఉప్పెనలో నటించి మొదటి సినిమాతోనే ఫుల్ ఫేమ్ తెచ్చేసుకుంది ఈ అమ్మడు. పట్టుమని 20ఏళ్లు కూడా లేని ఈ లేత వయస్సు అందాల భామ ఇప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేస్తోంది. ఉప్పెన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.
శ్యామ్ సింగరాయ్ మూవీతో మరోసారి మెప్పించిన కృతి శెట్టి బోల్డ్ సీన్లలో నటించి మరింత హీట్ పెంచింది. నానికి లిప్ లాక్స్ ఇచ్చి తానేం తక్కువ కాదని అనిపించకుంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన బంగార్రాజు మూవీలోనూ కృతి శెట్టి మరో హిట్ అందుకుంది. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు సుధీర్ కొత్త మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో నటించింది.
ఇలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కృతిశెట్టికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బేబమ్మ తన డ్యాన్స్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. తమిళ్ పాపులర్ సాంగ్ అయిన అరబిక్ కుతుకి పాటకు నడుము ఊపుతూ వయ్యారాలను వలకపోసింది. ఉప్పెన ఫేమ్ బేబమ్మ అంటే.. బేబమ్మే అన్నట్టుగా తన ఊపుడుతో మరో ఉప్పెన రేపుతోంది..
Read Also : Chiranjeevi: ఆర్ఆర్ఆర్ సినిమాపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి… మాటల్లేవ్ అంటూ కామెంట్స్!