Karthika Deepam serial Oct 3 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో కార్తీక్,దీప దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, మనసంతా ఏదోలా ఉంది వంటలక్క అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శివ వస్తాడు. సర్ ఇందాక పిలిచారు అంట కదా అని అనగా ఏదో పని ఉండి పిలిచాను ఇప్పుడేం పని లేదు వెళ్ళిపో శివ అని అనడంతో మీరు కూడా నాతో పాటు రండి సార్ మేడం మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళమని చెప్పింది అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు.
అప్పుడు కార్తీక్ నేను ఎప్పుడు వెళ్లాలో ఎప్పుడు ఉండాలో మీ మేడం చెప్పాలా నాకు బయటకు వెళ్లాలని లేదు ఇక్కడే ఉంటాను నేను వెళ్ళిపో అని అంటాడు. ఇంతలోనే దుర్గ ఫోన్ చేసి శివకి డబ్బులు వేసి సినిమాకు వెళ్ళు అని చెప్పడంతో శివ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కార్తీక్ మరింత కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు కార్తీక్ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో దీప ఏం కాదు అని చెప్పి మంచినీళ్లు తీసుకొని వచ్చి డాక్టర్ బాబుకు ధైర్యం చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు కార్తీక్ ఇంత జరుగుతున్నా కూడా ఎలా ప్రశాంతంగా ఉండాలి. ఈ నిజం కాలనీలో అందరికీ తెలిస్తే నా పరువు ఏం కావాలి అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు డోర్ కి అడ్డంగా దుర్గ పడుకుని ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి దుర్గను రాడ్డుతో కొట్టాలని చూస్తుంది. అప్పుడు దుర్గ అది పసిగట్టి వెనక్కి తిరిగి చూడడంతో మోనిత ఏమి లేదు అంటూ కవర్ చేస్తుంది.
కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 3 ఈరోజు ఎపిసోడ్ : మోనిత నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదన్న కార్తీక్..
ఇప్పుడు దుర్గా కార్తీక్ బాబు బయటకి వెళ్ళాడు అనుకుంటున్నావా కాదు వంటలక్క ఇంటికి వెళ్లారు అని అనడంతో మోనిత అక్కడికి వెళుతుంది. అప్పుడు కార్తీక్ నేను మోసపోయాను వంటలక్క దారుణంగా మోసపోయాను. ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అనడంతో మోనిత ఎవరి గురించి ఇంతలా అనుకుంటున్నారు అని అనగా మోనిత నన్ను ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని కార్తీక్ అనడంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది.
కార్తీక్ దుర్గా ప్లాన్ చెప్పడంతో కోపంతో అక్కడికి వెళుతుంది మోనిత. అప్పుడు దుర్గనీ రాడ్ తో కొట్టి చంపాలి అనుకుంటుంది. మరి చంపితే పోలీస్ కేస్ అవుతుంది అని ఇంజక్షన్ వేయాలి అనుకుంటుంది. ఇంతలోనే కార్తీక్, దీప అక్కడికి వస్తారు. అప్పుడు కార్తీక్ అదంతా నా అపోహ అన్నావ్ కదా వంట లెక్క ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు కార్తీక్.
అప్పుడు మోనిత టెన్షన్ పడుతూ ఉండగా దీప, దుర్గ ఇద్దరూ సంతోష పడుతూ ఉంటారు. మోనిత పరిస్థితిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. మరుసటిరోజు కార్తీక్ బాబుతో ఆడుకుంటూ ఉండగా మోనిత అక్కడికి వచ్చి ఎలా అయినా నిజం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది.