Karthika Deepam serial Oct 4 Today Episode : మోనిత చెంప చెల్లుమనిపించిన డాక్టర్ బాబు.. దీప నా భార్య అంటూ..?

Karthika Deepam serial Oct 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ కి ఎలా అయినా నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ బాబుతో ఆడుకుంటూ ఉండగా వెనుక వైపు మోనిత వచ్చి కార్తిక్ కీ ఎలా అయినా నిజం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను మౌనంగా ఉంటే కార్తీక్ అది నిజమని అనుకుంటాడు ఎలా అయినా సర్ది చెప్పాలి అని కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మోనిత,కార్తీక్ నా మీద నీకు నమ్మకం ఉంది కదా అని అడగగా దేని గురించి మాట్లాడుతున్నా మోనిత అని అంటాడు కార్తీక్. దుర్గ విషయం గురించి అని మోనిత అనడంతో నేను ఆ విషయం గురించి అడగలేదు కదా మోనిత అని అంటాడు.

Advertisement

Advertisement

అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటున్నా మాటలు అనే దీప చాటుగా వింటూ ఉంటుంది. అప్పుడు మోనిత దొంగ ఏడుపులు ఏడుస్తూ ఆ దుర్గకు నాకు ఎటువంటి సంబంధం లేదు కార్తీక్ అని ఏడుస్తూ ఉండగా అప్పుడు కార్తీక్ తన గతాన్ని గుర్తు తెచ్చుకొని తన కడుపులో పెడుతున్న బిడ్డకు నేను కారణం కాదు అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో మోనిత, దీప ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు కార్తీక్ తలనొప్పితో బాధపడుతూ మోనిత వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతుంది. కార్తీక్ లోపలికి వెళ్లిన తర్వాత మోనిత గతంలో కార్తీక్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని అంతే కార్తీక్ కీ గతం గుర్తుకు వస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత దీప ఇంటికి వెళ్లి దుర్గ మనం మోనిత పై చూపిన ప్రభావం డాక్టర్ బాబు మీద కూడా పడినట్టు ఉంది ఆయన గతంలో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నాకు టెన్షన్ గా ఉంది అనడంతో వెంటనే దుర్గా డాక్టర్లు నువ్వు గుర్తు చేయకూడదు అని చెప్పారు కానీ సార్ అంతటి సార్ గుర్తు తెచ్చుకుంటే ఏం కాదు కదా దీపమ్మ అని ధైర్యం చెబుతాడు. కానీ ఎందుకో నాకు రిస్క్ తీసుకోవాలి అనిపించలేదు దుర్గ అని అంటుంది దీప. తర్వాత మన ప్లాన్ ప్రకారం మోనిత ను భయపెట్టి దాంతోనే కార్తీక్ కి నిజం చెప్పిద్దాము అని దుర్గకు ఒక ప్లాన్ చెబుతుంది.

Advertisement

కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : మోనితా నువ్వు నా భార్య కాదు.. కాల్ డేటాతో కార్తీక్‌ క్లారిటీ..

ఇప్పుడు దుర్గ ఇలా చేస్తే కార్తీక్ సార్ మోనిత చెంప పగలగొడతాడు అనడంతో అనుకున్న విధంగానే కార్తీక్, మోనిత చంప చల్లుమనిపిస్తాడు. అంతేకాకుండా కార్తీక్ దీప చేయి పట్టుకుని ఉంటాడు. అది చూసి మోనిత దాన్ని చేయి పట్టుకున్నావ్ ఏంటి కార్తీక్ అనడంతో మళ్ళీ కొట్టి దాన్ని దీన్ని అనకు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఎంత మోసం చేసావే. నా భార్య ని పరాయిదాన్ని చేసి, నాకోసం ఏకంగా ఒక ఊరిని సృష్టించి నాతోనే దీపం తిట్టిస్తావా అంటూ అసహ్యించుకుంటాడు కార్తీక్.

Advertisement

ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు చంపేయాలి అని మోనిత పీక పట్టుకోవడంతో వెంటనే మోనిత అలా జరగడానికి వీల్లేదు అంటూ గట్టిగా అరవడంతో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఇప్పుడు ఏమైంది అని అడగగా మోనిత ఏం లేదు అని చెప్పడంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దీప తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దుర్గ పూజా సామాగ్రికీ కావలసిన తీసుకొని వస్తాడు.

Advertisement

తర్వాత వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు మోనిత కార్తీక్ కోసం పకోడీలు తీసుకుని వచ్చి గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అని చెబుతూ ఉండగా కార్తీక్ తన గతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలోనే దుర్గ అక్కడికి వస్తాడు. ఏంటి మోనిత నాకోసం పకోడీ చేస్తాను అర్ధ గంట తర్వాత రమ్మన్నావు లేట్ అయ్యేసరికి కార్తీక్ బాబుకు పెడుతున్నావా అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు లేదు కార్తీక్ వాడు అబద్ధం చెబుతున్నాడు అనడంతో దుర్గ కాల్ హిస్టరీని చూపిస్తాడు. దాంతో అడ్డంగా బుక్ అవుతుంది. అప్పుడు మోనిత భయపడకు మోనిత ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మన గురించి సార్ కి తెలుసులే అని అంటాడు దుర్గ.

Advertisement

Read Also : Karthika Deepam serial Oct 3 Today Episode : కార్తీక్‌కు అడ్డంగా దొరికిపోయిన మోనిత.. ఆనందంలో వంటలక్క, దుర్గ..?

Advertisement
Advertisement