Karthika Deepam Oct 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వాణి కార్తీక్ ఎక్కడ ఇడ్లీ తింటాడో అని భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వాణి దుర్గా ఇడ్లీ కింద పడేసి ఏమయింది అని అనగా కార్తీక్ అన్నయ్య ఇద్దరు కలిసి తినండి. నువ్వు ఒక్కడివే ముందు తింటే బాగోదు అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి తింటుండగా కార్తీక్ అన్నయ్య ఆగు అని అనగా మళ్ళీ ఏమైంది అనటంతో ఇడ్లీ తినే ముందు కొంచెం వాటర్ తాగితే మంచిది అని కవర్ చేస్తుంది. అప్పుడు కార్తీక్ తింటూ ఉండగా ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఆ ప్లేట్ ని విసిరి కొడుతుంది.

అప్పుడు వారిద్దరూ ఒకరికొకటి తెలియదు అన్నట్టుగా నాటకాలు ఆడుతూ కుర్చీలు తీసుకొని కొట్టుకుంటూ రెచ్చిపోతుంటారు. అది చూసి కార్తీక్,ఆపు మోనిత ఎందుకు నువ్వు ఇలా తయారవుతున్నావు అని మోనిత ను కోపంగా అరుస్తాడు. ఆ తర్వాత అమౌంట్ తో కార్తీక్ ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. మరొకవైపు ఇంద్రుడు ఆటో తుడుస్తూ ఏంటి జ్వాలమ్మా ఇంకా రాలేదు అని పిలుస్తూ ఉండగా ఇంతలో ఇంద్రమ్మ బయటికి వచ్చి సౌర్య పెద్దమనిషి అయ్యింది అని చెప్పడంతో ఇంద్రుడు సంతోషపడుతూ ఉంటాడు

అప్పుడు ఆమె పెళ్లి కొన్ని సరుకులు తీసుకుని రా అని ఇంద్రుడిని అక్కడ నుంచి పంపిస్తుంది. మరొకవైపు కార్తీక్, సౌర్య గురించి ఆలోచిస్తూ ఏంటి రౌడీ ఇది ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు నువ్వు ఈ వయసులో ఇలా బతకాల్సిన అవసరం ఏముంది అని బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు దీప కూడా సౌర్యం తలుచుకొని ఎక్కడ ఉన్నావు అత్తమ్మ ఒకదానివే ఉన్నావా లేక నీతో పాటు ఎవరైనా ఉన్నారా అని సౌర్య ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.
Karthika Deepam అక్టోబర్ 26 ఎపిసోడ్ : దుర్గకు వాణి మీద అనుమానం.. ఇరుకున పడిన మౌనిత...
మరొకవైపు శౌర్య గురించి ఆలోచిస్తున్న కార్తీక్ ఎలా అయినా మోనిత అసలు నిజం చెప్పించాలి అని ఇంటికి వెళ్తాడు. అక్కడ మోనిత ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వెళ్లి ప్రియమణి అంటే ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మోనిత ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. అప్పుడు మనకు పెళ్లయి ఎన్నేళ్లు అయ్యింది.

మోనిత మన పిల్లాడు చూస్తే ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంది అంటే మన పెళ్లి రెండేళ్లు అయ్యిందా అంతేనా అని అడుగుతాడు కార్తీక్. దాంతో కార్తీక్ అడిగే ప్రశ్నలకు మోనిత టెన్షన్ పడుతూ మన సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాము అని అబద్ధం చెబుతుంది. ఆ తర్వాత ఎలా అయినా నీతో నిజం చెప్పిస్తాను అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు దుర్గా, వాణి ఇద్దరు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఇంతలో పోలీసులు ఎదురు కావడంతో వాళ్ళిద్దరూ పక్కకు వెళ్లి దాక్కుంటారు. ఆ తర్వాత దుర్గ నేనంటే పోలీసులకు చిక్క కూడదు అని దాకున్నాను మరి వాణి ఎందుకు దాక్కుంది అని వాణి నేనువెందుకు దాక్కున్నావ్ అని అడగడంతో ఏమీ లేదులే అని కవర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అంటుంది. దాంతో వాణి మీద దుర్గ కు అనుమానం వస్తుంది.

మరొకవైపు ఇంద్రమ్మ ఇంటి బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇంద్రుడు అక్కడికి వస్తాడు. ఏమైంది ఇంద్రమ్మ అని అనడంతో జ్వాలమ్మ గొప్పింటి మనిషిలా ఉంది. కానీ మనం ఫంక్షన్ చేయలేము ఏమో అని బాధపడుతూ ఉండగా నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. మరొకవైపు కార్తీక్, సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు. కార్తీక్ ఉన్నచోటే ఇంద్రుడు కూడా ఆటో దగ్గర నిలుచుకునే ఆలోచిస్తూ ఉంటాడు.
Read Also : Karthika Deepam Oct 25 Today Episode : వాణిని గుడ్డిగా నమ్మిన దీప, దుర్గ.. మోనితను అనుమానిస్తున్న కార్తీక్.?