Karthika Deepam Dec 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్,దీప ఇద్దరు ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ సౌర్యని ఆ ఇంద్రుడు మన దగ్గర దాచమ్మని చెప్పాను అన్న నిజాన్ని దీపకు తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీప టిఫిన్ చేద్దాం డాక్టర్ బాబు అని అంటుంది. అదేంటి దీప నేను హాస్పిటల్ కి వెళ్లి తింటాను నీకోసం ఆ చారుశీల పంపిస్తుందని చెప్పాను కదా మళ్లీ నువ్వు వంట గదిలోకి ఎందుకు వెళ్లావు అనడంతో ఈ ఒక్క పూటకు ఏం కాదులే డాక్టర్ బాబు పెళ్ళాం పదండి అని కార్తీక్ ని అక్కడికి పిలుచుకొని వెళ్తుంది.
ఇప్పుడు కార్తీక్ టిఫిన్ తినడానికి వెళ్తూ ఉండగా ఇంతలో చంద్రమ్మ వాళ్ళ ఇంటికి వస్తుండడం చూసిన కార్తీక్ వెంటనే షాక్ అవుతాడు. అప్పుడు చంద్రమ్మని దీప కంట కనిపించకుండా బయటకు రా అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఏంటి ఇలా వచ్చావు చంద్రుడు నీకు జరిగింది చెప్పలేదా అని అడగగా చెప్పాడు సార్ ఇది మీ ఇల్లు అని తెలియక వచ్చాను బాబు అని అంటుంది చంద్రమ్మ. అవునా సరే ఇటువైపు ఇంకెప్పుడు రాకు అని అనడంతో సరే అంటుంది చంద్రమ్మ. మరొకవైపు దీప డాక్టర్ బాబు రండి ఎక్కడికి వెళ్లారు అనుకుని కార్తీక్ ని వెతుకుతూ ఉంటుంది.
ఇంతలో కార్తీక్ చంద్రమ్మ కి డబ్బులు ఇచ్చి పాపను జాగ్రత్తగా చూసుకోండి కావలసినవి కొనివ్వండి అని డబ్బులు ఇస్తాడు. అప్పుడు దీప ఎక్కడికి వెళ్లారు డాక్టర్ బాబు అని అనగా ఎక్కడికి లేదు దీప ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఎవరో వస్తే మాట్లాడి పంపించేశాను అని అబద్ధం చెబుతాడు. మరొకవైపు సౌందర్యవాళ్ళు భోజనం చేస్తూ కార్తీక్, దీపల గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అని బాధపడుతుండగా ఆనందరావు కార్తీక్ వాళ్ళు ఇక లేరు అన్నట్టుగా మాట్లాడడంతో అదేంటండి మొన్న ఉన్నారు అని మీరు కూడా నమ్మారు కదా మళ్లీ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటుంది.
ఒకసారి ఆలోచించు సౌందర్య అంతా పెద్ద ప్రమాదం నుంచి వాళ్ళు బయటికి బయటపడగలరా అని అంటాడు ఆనందరావు. మరొకవైపు సౌర్య తన ఫంక్షన్ ఆల్బమ్ చూస్తూ ఉండగా ఇంతలో తన పిన్ని బాబాయిలతో కలిసి దిగిన ఫోటో కనిపించకపోవడంతో ఆ ఫోటో కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు చంద్రమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు ఇంద్రుడు ఆ సారూ ఎందుకు ఇలా చేశారు ఇప్పటికీ అర్థం కావడం లేదు అని అనగా చెప్పారు కదా గండ వాళ్లకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఈ విషయం పదే పదే మాట్లాడకు జ్వాలమ్మ కి అనుమానం వస్తుంది అని అంటుంది చంద్రమ్మ.
ఆ తర్వాత సౌర్య దగ్గరికి వెళ్లడంతో సౌర్య ఆనంద పడుతూ ఉండగా అప్పుడు చంద్రమ్మ వాళ్ళు సౌర్య కోసం బట్టలు చెప్పులు తీసుకొని వస్తారు. అవి చూసి సౌర్య ఆనంద పడుతూ ఉండగా వాళ్ళు కూడా ఆనంద పడుతూ ఉంటారు. మరొకవైపు దీప శౌర్య ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు దంపతులపై కోప్పడుతూ నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లారు రా అసలు మీరు మనుషులేనా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది దీప. ఇలా అయితే కాదు రేపటి నుంచి నా కూతురు కోసం వెతుకుతాను అనుకుంటూ ఉంటుంది దీప.
మరోవైపు కార్తీక్ ఒకచోట నిలబడి దీప గురించి తలుచుకొని కుమిలిపోతూ ఉండగా ఇంతలో చారుశీల ఏడవకు కార్తీక్ ధైర్యంగా ఉండు అని ఓదారుస్తూ ఉంటుంది. ఎలా ధైర్యంగా ఉండాలి చారుశీల ఒకవైపు అమ్మానాన్న దగ్గరికి వెళ్లలేక కూతుర్ని తెచ్చుకోలేక భార్య పరిస్థితి చూడలేక నరకం అనుభవిస్తున్నాను అంటూ కార్తీక్ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప నిద్రలేసి చూసేసరికి ఇంటి ముందు ముగ్గులు వేసి కల్లాపు చల్లి ఉండగా ఎవరు ఇదంతా చేశారు అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక ఆమె టెన్షన్ పడకు దీపమ్మ అవన్నీ నేనే చేశాను అని అంటుంది. ఇప్పుడు దీప ఎవరు నువ్వు అని అడుగుతూ ఉండగా ఆమె అసలు విషయం చెప్పకుండా కార్తీక్ గురించి తన గురించి మొత్తం డీటెయిల్స్ చెబుతూ సార్ నేను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు దీపమ్మ అని హడావిడి చేస్తూ ఉంటుంది.
Read Also : Karthika Deepam Dec 10 Today Episode : ఇంద్రుడు మాటలు విని సంతోషపడిన చంద్రమ్మ.. దగ్గరవుతున్న కార్తీక్, దీప?