Karthika Deepam Dec 13 Tody Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దీప, పండరి గురించి ఆలోచనలో పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య కొత్త పనిమనిషితో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే ఆనందరావు అక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ సౌందర్య అనడంతో పనిమనిషితో మాట్లాడుతున్నానండి ఇవాళ నుంచి జాయిన్ అవుతుంది అని అంటుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అనగా నేను కొడుకు, కోడలిని వెతకడానికి వెళుతున్నాను వాళ్ళు దొరికిన తర్వాతే తిరిగి వస్తాను అని అంటుంది. అప్పుడు వాళ్లు లేరు అన్నట్టుగా ఆనందరావు మాట్లాడడంతో అదేంటండి అలా మాట్లాడతారు అని సౌందర్య. అలా వారిద్దరూ కార్తీక్, దీపల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

Karthika Deepam Dec 13 Tody Episode
మరొకవైపు కార్తీక్ జాగింగ్ కి వెళుతూ ఉండగా ఇంతలో పండరి అక్కడికి వచ్చి జాగింగ్ కి వెళ్లడానికి వీల్లేదు బాబు ఈరోజు శుక్రవారం కదా ఇంట్లోనే ఉండి మీరు దీపమ్మ కలిసి పూజ చేసి తర్వాత బయటికి వెళ్ళండి అనడంతో వెంటనే కార్తీక్ కోపంతో ఎవరు నువ్వు అని అనగా వెంటనే పండరీ దీపమ్మ స్నానం చేసేది అయిపోయింది మీరు వెళ్ళండి మీకు వేడి నీళ్లు పెట్టాను అని అనగా ఎవరు నువ్వు అని అనడంతో అక్కడకు వచ్చి వెళ్ళని డాక్టర్ బాబు లేకపోతే రెండిట్లో దెబ్బలైనా కొడుతుంది అని అంటుంది. ఎవరు దీప ఈమె అనడంతో చారుశీల పంపించింది అని అనగా అవునా అని అంటాడు కార్తీక్.
సరే బాబు మీరు వెళ్ళండి స్నానానికి వేడి నీళ్లు పెట్టాను అని అనగా సరే అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత దీప అద్దంలో చూస్తూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా, అలా బొట్టు పెట్టుకోకూడదు దీపమ్మ ఎప్పుడైనా తూర్పుకు తిరిగి సూర్యుడికి ఎదురుగా నిలబడి బొట్టు పెట్టుకోవాలి అని చెబుతుంది. ఆ తర్వాత దీప పండరీ గురించి వివరాలు అడగడంతో వేరే పని ఉంది ఇడ్లీ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
Karthika Deepam Dec 13 Tody Episode : పూలు కోస్తూ కింద పడిన శౌర్య..
మరొకవైపు చంద్రమ్మ ఇంటికి వచ్చి రాగా వచ్చావా పిన్ని అని జ్వాల అనడంతో అవును జ్వాలమ్మా నీకోసము క్యారెట్ ముల్లంగి అవి తెచ్చాను అని అనగా మరి బాబాయ్ కి అవి ఇష్టం లేదు కదా పిన్ని అనడంతో దోసకాయలు తెచ్చాను మీ బాబాయ్ కి దోసకాయ పచ్చడి చేసి పెడతాను అని అంటుంది చంద్రమ్మ. వెంటనే సౌర్య కోపంతో ఆ దోసకాయలను విసిరి కొడుతుంది. అప్పుడు చంద్రమ్మ సరే అని లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత సౌర్య ఇంటి బయట పూలు కోస్తూ ఉండగా చంద్రమ్మ జాగ్రత్తగా సౌర్యమ్మ అని అంటుంది.
అప్పుడు సరే పిన్ని అని పైకి ఎక్కి పూలు కోస్తుండగా అనుకోకుండా కింద పడిపోతుంది సౌర్య. దాంతో చంద్రమ్మ అక్కడికి వచ్చి సౌర్యని చూసి షాక్ అవుతుంది. మరొకవైపు దీప ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో పండరి అక్కడికి వచ్చి ఈ పనులన్నీ నీకెందుకు దీపం నేను ఉన్నాను కదా నువ్వు అలా కూర్చో కాఫీ తీసుకొని వస్తాను అని కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు దీప పండరి గురించి వివరాలు అడగగా పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు దీప ఆలోచనలో పడుతూ అసలు ఏంటి ఈ పండరి తన గురించి ఏం అడిగినా చెప్పడం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ అనుమాన పడుతూ ఉంటుంది.
మరోవైపు కార్తీక్ దీప పరిస్థితి తలచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో ఇంద్రుడు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సర్ పాప కింద పడింది తలకు దెబ్బ తగిలింది అనడంతో సరే అని తన హాస్పిటల్ కి తీసుకొని రమ్మని చెబుతాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య దీప వాళ్లను వెతకడానికి వెళుతుంది. కార్ డ్రైవర్ గతంలో పనిచేసిన అంజినీ కార్ డైవర్ గా పెట్టుకుంటుంది సౌందర్య. ఆ తర్వాత ఇంద్రుడు దంపతులు సౌర్యని హాస్పిటల్కి తీసుకుని రావడంతో కార్తీక్ చెక్ చేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అసలు ఏం జరిగింది అని కార్తీక్ అడగగా చంద్రమ్మ కిందపడిపోయింది అని చెప్పడంతో వెంటనే కార్తీక్, చంద్రమ్మ పై సీరియస్ అవుతాడు.
తర్వాత చారుశీల సౌర్యకి లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తుంది. అప్పుడు సౌర్య, దగ్గరికి వచ్చిన కార్తీక్ సౌర్య పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కార్తీక్ పేరు ఎత్తడంతో వెంటనే సౌర్య మెలకువ వచ్చి నాన్న అని అంటుంది. అప్పుడు కార్తీక్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు చంద్రమ్మ శౌర్యమ్మ నికేం కాలేదు నీకు బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉండగా నాకు బాగానే ఉంది కానీ మా నాన్న ఇక్కడికి వచ్చాడు పిన్ని ఎవరు కార్తీక్ అని పిలిచారు అనడంతో చాటుగా ఉండి ఆ మాటలు వింటున్న కార్తీక్ బాధపడుతూ ఉంటాడు.