Relationship : ఒకప్పుడు సెక్సీ అనే పదం వినిపిస్తే చాలు. ఏదో బూతు పదం వాడామని చాలా మంది అపార్థం చేసుకునేవారు. ఇప్పటికీ రూరల్ ఏరియాల్లో సెక్సీ అనే పదం వింటేనే వీడు చెడ్డోడు, మంచోడు కాదని జడ్జ్ చేస్తుంటారు కొందరు. అయితే, సెక్సీ పదం అనేది అమ్మాయిల అందాన్ని అభివర్ణించడంలో ఒక విధమైన లాంగ్వేజ్ అనుకోవచ్చు. అమ్మాయిల నడక, అందం, చీర కట్టు, డ్రెస్సింగ్ సెన్స్, మాట్లాడే విధానం, హ్యాబిట్స్, స్మైల్, కామెడి టైమింగ్ ఇలాంటి లక్షణాల్లో ఏదైనా నచ్చితే కొందరు మగవారు ఇలాంటి లాంగ్వేజ్‌ను ఉపయోగించవచ్చు.మగవారిని అంతలా రెచ్చగొట్టే ఆడవారు చేసే పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొందరు అమ్మాయిలు అబ్బాయిలు వేసే జోకులకు విపతీరంగా నవ్వుతుంటారు. అందులో ఒక్కోసారి కామెడీ టైమింగ్ మిస్సయినా నవ్వుతుంటే మగవారికి బాగా నచ్చుతుందట.. అందుకే ఒక్కోసారి మగవారు ఫూల్ అయ్యాం అని తెలిసిన తమకు నచ్చిన వారిని నవ్వించేందుకు ట్రై చేస్తూనే ఉంటారు. ఇకపోతే మహిళలు, అమ్మాయిలు ఎక్కువగా పిల్లలతో ప్రేమగా ఉన్నా, ముద్దు చేస్తుంటే బాగా నచ్చుతారట. వీరు మంచి మనస్సు కలవారని, మృదు స్వభావులని భావిస్తారట.. వర్కౌట్స్ విషయంలోనూ ఫిజికల్ ఫిట్‌నెస్, స్ట్రాంగ్, హెల్దీగా ఉండే ఆడవారిని మగవారు బాగా లైక్ చేస్తారట.. కుక్క పిల్లల వలే ఆడవారు ఒక వైపు తల వంచి క్యూట్‌గా చూస్తుంటే అబ్బాయిలు తెగ ఇష్టపడతారని తెలుస్తోంది.
ఇక తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, డ్రింక్స్ తీసుకునే విధానంలో కూడా ఆడవారు కొన్ని మెలకువలు పాటిస్తారట.. స్లోగా, నీట్‌గా, పద్దతిగా డ్రింక్స్, ఆహారం తీసుకునే వారిని చాలా మంది లైక్ చేస్తారట.. ఇంకా ఫుడ్ వేస్టేజి చేయని ఆడవారు అంటే అమితంగా లైక్ చేస్తారట.. ఇకపోతే కొందరు అమ్మాయిల హెయిల్ స్టైల్, క్రాఫ్ చేయించుకోవడం, బాడీ మీద టాటూస్ వేయించుకునే వారంటే కూడా మగవారు ఇష్టపడతారట..
కారణం వీరు ఎంత పెయిన్ అయినా భరిస్తారని, ఓపెన్‌గా ఉంటారని మగవారు భావిస్తారట.. ఇండిపెండెంట్‌గా ఉండటం, మగవారికి తెలియని విషయాలు చెప్పే వారంటే చాలా మంది లైక్ చేస్తారట..ముఖ్యంగా చదువు,అందం, ఆటలు, తెలివి తేటలు, పజిల్స్ సాల్వ్ చేయడం, శుభ్రతకు అధికంగా ప్రయారిటీ ఇచ్చేవారికి వదులుకోవడానికి మగవారు అస్సలు ఇష్టపడరు అని తెలిసింది.
Read Also : Relationship : మీ పార్ట్‌నర్ అలా చేస్తున్నారా? ఇక కలిసుండటం కష్టమే.. తస్మాత్ జాగ్రత్త..!