Guppedantha Manasu Dec 13 Today Episode : దేవయాని ప్లాన్ ని మహేంద్రకు చెప్పిన వసుధార.. బాధపడుతున్న రిషి?

Guppedantha Manasu Dec 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు, రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుధార చేతులు పట్టుకొని నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు.

Advertisement

ఈ రిషి ఉండగా నీకెందుకు భయం అని అంటాడు. ఎప్పుడు నువ్వు మీ మేడం దగ్గరే ఉంటే ఎలా నాకు కూడా అప్పుడప్పుడు కనిపించాలి కదా అని అనగా ఎందుకు సార్ అని అనడంతో నువ్వు కనిపించకపోతే నా ప్రాణం పోయినట్టు ఉంటుంది వసుధార అని అంటాడు రిషి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వసుధార రిషి ని హత్తుకుని ఆనందపడుతూ ఉంటుంది.

Advertisement
Guppedantha Manasu Dec 13 Today Episode
Guppedantha Manasu Dec 13 Today Episode

ఒకవైపు కాలేజీలో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో మీటింగ్ ని ఏర్పాటు చేసిన రిషి ఇన్ని రోజులు జగతి మేడం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని చూసుకున్నారు అనడంతో అందరూ ఆలోచిస్తూ ఇన్ని రోజులు అంటున్నాడు ఏంటి అని అనగా వెంటనే రిషి మీ అందరి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే నేను ఒక వీడియో చూపిస్తాను అని జగతి మాట్లాడిన వీడియోని చూపిస్తాడు రిషి. ఆ వీడియోలో జగతి తాను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పకుండా ఆ స్థానంలో వసుధారని నియమిస్తున్నట్టు చెప్పడంతో ఆ వార్త విన్న కాలేజీ స్టాఫ్ షాక్ అవుతారు.

Advertisement

అప్పుడు రిషి విన్నారు కదా ఇది మేడం అభిప్రాయం మాత్రమే కాదు మినిస్టర్ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అనడంతో ఇంతలో మినిస్టర్ రిషికి ఫోన్ చేస్తాడు. అప్పుడు మినిస్టర్ మనం జగతి మేడం స్థానంలో వసుధారని హెడ్ గా నియమించాలి అనుకున్నాము అది మంచి విషయమే వసుధార కూడా అందుకు పూర్తిగా అర్హురాలు. కాని రేపటి రోజున ఎవరైనా వసుధారని ఎందుకు నియమించారు. మీకు ఇష్టం వచ్చిన వారిని నియమిస్తారా అని అడిగితే మనం సమాధానం చెప్పలేము కదా అని అంటాడు మినిస్టర్.

Advertisement

అప్పుడు అవును సార్ అని అనడంతో సరే రిషి ఈ విషయంలో నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు మినిస్టర్. అప్పుడు సరే అని రిషి ఫోన్ కట్ చేయగా మహేంద్ర ఫణింద్ర ఇద్దరు ఏం జరిగింది రిషి అని అడుగుతారు. అప్పుడు అసలు విషయం చెప్పడంతో కాలేజీ స్టాఫ్ ఆనందపడుతూ ఉండగా మహేంద్ర ఆశ్చర్యపోతారు. అప్పుడు మహేంద్ర ఏం చేద్దాం రిషి అని అడగగా కొద్దిసేపు ఆలోచించుకున్న రిషి ఓటింగ్ పెడదాము డాడ్ ఓటింగ్లో మెజారిటీ ప్రకారం వసుధార గెలిస్తే దాని ప్రకారం నిర్ణయం తీసుకుందాము అని అంటాడు రిషి.

Advertisement

Guppedantha Manasu Dec 13 Today Episode : షాక్‌లో వసుధార.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర..

ఆ తర్వాత వసుధార జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ అక్కడినుంచి వెళ్తూ ఉండగా ఇంతలో కాలేజీ స్టాఫ్ లో ఒక మేడం దేవయాని కి ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం వివరించడంతో ఆ మాటలు విన్న వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. మేడం మీరు చెప్పినట్టుగానే చేసాము మినిస్టర్ గారికి మెయిల్ చేశాను అని అనగా ఆ మాట విన్న వసుధార షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జగతికి మహేంద్ర ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి బాధపడుతూ ఉండగా అప్పుడు అదేంటి మహేంద్ర అని జగతి కూడా బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే వసుధార అక్కడికి రావడంతో వెంటనే మహేంద్ర సారీ వసుధర ఇలా జరుగుతుంది అనుకోలేదు అని అనగా వెంటనే వసుధార దీనికి అంతటి కారణం దేవయాని మేడం సార్ అనగా మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ఇదే మహేంద్ర కోపంతో రగిలిపోతూ అక్కడ నుంచి వెళ్తూ ఉండగా వసుధర అడ్డుపడి ఇప్పుడు మనం ఏదైనా చేస్తే దానిని దేవయాని మేడం తనకి అనుగుణంగా మలుచుకుంటుంది సార్ అని నాతో చెబుతుంది. మరొకవైపు రిషి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసుధార అక్కడికి వస్తుంది.

Advertisement

ఏంటి వసుధార అనడంతో ఈ మిషన్ ప్రాజెక్టు కి హెడ్ గా నేను ఉండడం అవసరమా సార్ అని అనగా వెంటనే రిషి ఆశ్చర్యపోయి ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని అనగా ఏం లేదు సారీ హోదాలు ఓటింగ్లు ఇవన్నీ ఎందుకు సార్ అని అనడంతో నువ్వేం మాట్లాడకు వసుధర నేను ఎలా అయినా ఈ విషయంలో సాధిస్తాను నిన్ను హెడ్ గా నియనిస్తాను అని అంటాడు రిషి. తర్వాత మీటింగ్ హాల్లోకి వెళ్లిన రిషి మీలో ఎవరైతే వసుధార హెడ్ గా ఉండాలి అనుకుంటున్నారో వారు ఎస్ అని టిక్ చేయండి వద్దు అనుకున్న వారు నో అని టిక్ చేయండి అని ఓటింగ్ పెడతాడు. ఇప్పుడు పనింద్ర మొదట మొదలుపెట్టగా ఆ తర్వాత ఒక్కొక్కరిగా వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు.

Advertisement

Read Also : Guppedantha Manasu Dec 12 Today Episode : పెళ్లి గురించి ఆలోచిస్తున్న వసుధార, రిషి.. సంతోషంలో జగతి..?

Advertisement
Advertisement