Telugu NewsEntertainmentMega Star : మెగాస్టార్ వారసుడి పేరు ఏంటో తెలుసా? చిరు అదే సెంటిమెంట్ రిపీట్...

Mega Star : మెగాస్టార్ వారసుడి పేరు ఏంటో తెలుసా? చిరు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడా?

Mega Star : మెగా ఫ్యామిలీలో సందడి మొదలైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు అదిరిపోయే వార్త ఒకటి మెగా కంపౌండ్ నుంచి బయటకు వచ్చింది. మెగాస్టార్ నట వారసుడు అయిన మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి త్వరలో తాత కాబోతున్నాడని అంటున్నారు. మెగా వారసుడు రాబోతున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. రామ్ చరణ్‌కు కొడుకే పుడతాడని అభిమానులు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Mega Star Chiranjeevi to be repeated mega sentiment for his Grand Son Name
Mega Star Chiranjeevi to be repeated mega sentiment for his Grand Son Name

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు పెళ్లి అయిన పది ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ఇన్నాళ్లకు మెగా అభిమానులకు సంతోషకరమైన వార్తను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేశారు. ఇప్పుడా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే విషయం తెలిసి మెగా అభిమానులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్, ఉపాసనలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. వీరిద్దరి ఫొటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Mega Star : తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన.. 

మొన్నటివరకూ ఇంకా పిల్లలు లేరంటూ చరణ్, ఉపాసనలపై ట్రోల్స్ చేసిన వారంతా ఇప్పుడు కంగ్రాట్స్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. అయితే రామ్ చరణ్‌కు కచ్చితంగా కొడుకే పుడతాడంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. రాబోయే మెగా వారసుడు తండ్రి రామ్ చరణ్, తాత చిరంజీవిని మించిపోయేలా ఉంటాడని అంటున్నారు. అంతేకాదు.. రామ్ చరణ్, ఉపాసనలకు పుట్టబోయేది బాబేనంటూ ముందుగానే పేరును కూడా మెగా ఫాన్స్ చెప్పేస్తున్నారు.

Advertisement
Mega Star Chiranjeevi to be repeated mega sentiment for his Grand Son Name
Mega Star Chiranjeevi to be repeated mega sentiment

మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకూ వారాసులుగా వచ్చిన వారిలో చాలామంది పేరు వెనుక తేజ్ అని ఉండటం అందరికి తెలిసిందే.. రామ్ చరణ్ తేజ్.. ఇలాగే.. చరణ్‌కు పుట్టబోయే బిడ్డకు కూడా తేజ్ కలిసి వచ్చేలా పేరు పెట్టే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. అదేగానీ నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి తన మనవడికి కూడా పేరులో తేజ్ కలిసి వచ్చేలా పెడతారని అంటున్నారు. అందులోనూ చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు.. కోడలు ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన హనుమాన్ ఆశీస్సులతో ఒక పోస్టు పెట్టారు.

Advertisement

అంటే.. చరణ్ కు పుట్టబోయే బిడ్డకు కూడా ఆంజనేయస్వామి పేరు కలిసివచ్చేలా పెడతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. మెగా సెంటిమెంట్ రిపీట్ చేసేలా.. చిరు తన వారసుడికి ‘అంజన్ తేజ్’ అని పేరు పెట్టాలంటూ మెగా అభిమానులు కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. పుట్టబోయే మనవడు లేదా మనవరాలికి ఎలాంటి పేరు పెడతాడో తెలియాలంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే అంటున్నారు.

Advertisement

Read Also : Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఇదిగో ప్రూఫ్..!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు