Janaki Kalaganaledu june 15 Today Episode : ఆనందంలో తులసీ కుటుంబం.. తులసి పై ఫైర్ అయిన లాస్య..?: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో శ్రీలత అనే అమ్మాయి రామచంద్ర పై నింద మోపడంతో జడ్జిలు రామచంద్రని తప్పుగా అపార్థం చేసుకుంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర టేబుల్ పక్కనే ఉన్న శ్రీలత అనే అమ్మాయి డబ్బుకి ఆశపడి సునందతో డబ్బులు ఇప్పించుకుని మరి రామచంద్ర ఓడిపోయే విధంగా చేయాలని ప్లాన్ వేయడంతో వెంటనే జానకి సీసీ ఫుటేజీ ద్వారా ఆ అమ్మాయి ప్లాను తిప్పి కొడుతుంది.
దాంతో జానకి చేసిన పనికి సునందా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. శ్రీ లత అనే అమ్మాయి తప్పు తనదే అని ఒప్పుకోవడంతో జడ్జీలు రామచంద్రకు క్షమాపణలు చెబుతారు. ఒక సెమీఫైనల్లో శ్రీలత తో పాటుగా మరొక కాంటెస్టెంట్ ని కూడా ఎలిమినేట్ చేస్తారు. మరొకవైపు విష్ణు మల్లిక తో మోకాళ్ళ ప్రదర్శనలు చేయిస్తూ ఉండగా, ఇంతలోనే గోవిందరాజు విష్ణు ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పడంతో అప్పుడు విష్ణు లోపల సంతోషపడుతూ బయటకు మొఖం ఒకలాగా పెడతాడు.
మల్లిక ఏదో జరిగింది అని ఆనంద పడుతూ ఉండగా అప్పుడు విష్ణు మా అన్నయ్య సెమీఫైనల్లో గెలిచాడు అనడంతో మల్లిక ఏడుపు మొహం పెడుతుంది. ఆ తర్వాత రామచంద్ర దంపతులు, గోవింద రాజ దంపతులు సరదాగా రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడికి కన్నబాబు రావడంతో కన్నబాబు సరైన సమాధానం చెబుతారు జ్ఞానాంబ కుటుంబం.
గోవిందరాజు వెటకారం గా సమాధానమిస్తూ ఉండటంతో కన్నబాబు కోపంతో రగిలిపోతాడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా రామచంద్ర తప్పకుండా గెలుస్తాడు అని అంటాడు గోవిందరాజు. ఆ తర్వాత రామచంద్ర జానకి ఒకచోట కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో మేడ పై నుంచి రామచంద్ర చేతిపై కి పూల కుండిని విసురుతాడు
కన్నబాబు.
అప్పుడు డాక్టర్ వచ్చి వైద్యం చేసి కాస్త జాగ్రత్తగా ఉండండి ఎటువంటి పనులు చేయకూడదు అని చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.