Janaki Kalaganaledu june 14 Today Episode : స్టార్ మా లో ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. జ్ఞానాంబ వద్దని చెబుతున్నా జానకి రామ వంటల పోటీకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన వంటల పోటీల్లో పాల్గొన్న మొదటి నుంచి రామాకు ఎంత అవమానం జరుగుతుంది. ఇక తాజాగా నేడు జరిగే ఎపిసోడ్ లో భాగంగా వంటల పోటీల్లో రామాకు పెద్ద టాస్క్ ఎదురయింది. ఈ వంటల పోటీల్లో భాగంగా మాంసాహారం చేయాలని జడ్జ్ సూచించారు.

రామా మాంసాహారం ముట్టుకోకు పోవడంతో తాను ఈ వంటకం కాకుండా మరే వంటకం అయినా చేస్తానని చెప్పడంతో అందుకు న్యాయనిర్ణేతలు ఒప్పుకోరు మాంసాహారం చేయకపోతే ఈ కాంపిటీషన్ నుంచి తప్పుకోవాలని సూచిస్తారు. అదే సమయంలో జానకి న్యాయనిర్ణేతల దగ్గరకు వెళ్లి వంటల పోటీల్లో భాగంగా ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఇతరుల మనోభావాలను ఇబ్బంది పెట్టకూడదు అని రాసి ఉంటారు ఈ విషయం గురించి జానకి మాట్లాడుతుంది.
జానకి మాటలు విన్న న్యాయనిర్ణేతలు ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి రామా కళ్ళకు గంతలు కట్టుకొని తనకు నచ్చిన డిష్ చేయవచ్చని చెప్పారు. దీంతో రామ ఎంతో ధైర్యంతో ఈ వంటల పోటీల్లో పాల్గొంటారు.ఇదంతా చూస్తున్న మల్లిక ఓవైపు సంతోషపడుతూ బావగారు గెలవాలని మోకాళ్ళ ప్రదక్షిణ చేస్తా అంటూ కాస్త ఓవర్ ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఇదే అదునుగా భావించిన విష్ణు తనని నిజంగానే గుడికి తీసుకెళ్ళి మోకాళ్ళ ప్రదక్షణ చేయిస్తాడు.
ఈ వంటల పోటీల్లో రామ గెలవ కూడదని సునంద వంటల పోటీల్లో పాల్గొని మరొక వ్యక్తితో డీల్ కుదుర్చుకుని ఎలాగైనా తను కాంపిటీషన్ నుంచి బయటకు రావాలని డబ్బు ఇస్తుంది. ఇక రామా కూడా ఎలాగో తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె బయటికి పంపించడం కోసం పథకం వేస్తుంది. ఇక కళ్ళకు గంతలు కట్టుకొని వంట చేయగా వంట రుచి చూసిన జడ్జెస్ ప్రశంసిస్తారు. దీంతో జ్ఞానంభ ఎంతో సంతోషపడుతుంది. ఇకపోతే సునంద మనిషి తన వంటను తానే పాడు చేసుకుని తన వంటను రామపాడు చేశాడని చెబుతుంది.
ఈ విషయం విన్న న్యాయనిర్ణేతలు అక్కడ దొరికిన కొన్ని సాక్ష్యాల ఆధారంగా తప్పు రామాపై వేస్తారు. అయితే జానకి మాత్రం దీనికి ఒప్పుకోదు.కేవలం అక్కడున్న సాక్ష్యాల ఆధారంగా తప్పు రామ గారు చేశారని ఎలా అంటారని నిలదీస్తుంది. ఇంతకన్నా మరే సాక్షాలు కావాలంటే వెంటనే సిసిటివి ఫుటేజ్ చూడమని జానకి చెప్పడంతో ఒక్కసారిగా సునంద షాక్ అవుతుంది. అయితే తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
Read Also : Janaki Kalaganaledu: చెఫ్ కాంపిటీషన్ కు వచ్చిన కన్న బాబు, సునంద.. టెన్షన్ లో రామ చంద్ర..?