Kalisi Unte Kaladu Sukham July 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కలసి ఉంటే కలదు సుఖం అనే సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. గత ఎపిసోడ్ లో పూజ చరణ్ దగ్గరికి వచ్చి నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళి పోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా గీతమ్మ ఆఫీస్ ని చరణ్ తన పూర్తి అధీనంలోకి తీసుకుంటాడు కానీ మేనేజ్మెంట్ గా వ్యవహరిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న గీతమ్మ కొడుకులైన దేవా మరియు ప్రకాష్ లు చరణ్ పై విరుచుకు పడతారు. అప్పుడు చరణ్ నా అప్పు తీరిస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు.

Kalisi Unte Kaladu Sukham July 18 Today Episode
నీకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇలా మా ఆఫీస్‌కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావా అంటాడు ప్రకాష్. అప్పుడు చరణ్ ఒకవేళ మీరు ఆఫీస్ నమ్మేస్తే నా డబ్బులు పోతాయి కదా అందుకే జాగ్రత్త పడుతున్నాను అని అంటాడు. గడువులోపు నీ డబ్బులు నీకు ఇస్తాము ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే వెంటనే చరణ్ సారీ అంకుల్ నా డబ్బులు నాకు ఇచ్చే ఇంతవరకు ఈ ఆఫీస్ నాదే ఆ ఇల్లు కూడా నాదే అంటాడు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేకపోతే పోలీసులను పిలవాలా అంటాడు రవి. మీరు ఏం చేసినా నేను రెడీ. ఎలాంటి గొడవలకు దిగిన నేను రెడీ. గ్రేట్ రంగనాథ పిల్లలు అప్పు చేశారని రోడ్డున పడ్డారని అందరూ మాట్లాడుకుంటారు.
అప్పుడు రంగనాథ్ గారు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్ని మీరు రోడ్డు మీద పడేసిన వాళ్లు అవుతారు అని అంటాడు చరణ్. వెంటనే దేవా పోలీసులకి కాల్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రకాష్ ఏం వద్దు బయటికి వెళ్దాం పదండి అంటాడు. వెంటనే పోలీసులను పిలిస్తే వాడి అంతు చూసేవారు కదా ఎందుకు వద్దు అన్నావ్ అని దేవా ప్రకాష్ తో అంటాడు. అప్పుడు ప్రకాష్ ఈ విషయం బయట తెలిస్తే నాన్న పరువు పోతుంది. అప్పుడు అమ్మ చాలా బాధపడుతుంది. అయినా వాడు ఇక్కడ కూర్చోడం తప్ప ఏమి చేయలేడు. వాడికి ఎటువంటి లీగల్ రైట్ లేదు కొద్ది రోజులే కదా పర్లేదు వాడి మీద ఒక కన్నేసి ఉంచుదాం అంటాడు.

Kalisi Unte Kaladu Sukham July 18 Today Episode
చరణ్ స్టాప్ మెంబర్స్ ని పిలిచి ఇక ఈ రోజు నుండి నేనే మీ కొత్త బాస్ ని అంటాడు. ఆ విషయం ప్రకాష్ తో కూడా అందరికీ చెప్పిస్తాడు. ఇక్కడ ఏమి జరిగినా అన్ని నా ఆధ్వర్యంలోనే జరగాలి అంటాడు చరణ్. తర్వాత రవిని నీ పోస్ట్ ఏంటి ఇక్కడ అని అడుగుతాడు చరణ్. అప్పుడు రవి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పగానే నిన్ను ఆ పోస్ట్ లో నుండి తీసేస్తున్నా ను అని అంటాడు. ఇకనుండి నువ్వు ఫైనాన్స్ సెక్షన్ చూసుకో అంటాడు. అప్పుడు రవి ఫైనాన్స్ సెక్షన్ చంద్ర ఆంటీ చూసుకుంటుంది నేను చూసుకోవడం ఏంటి అంటాడు. చరణ్ చంద్ర ఆంటీ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ చూసుకుంటుంది. నువ్వు ఇది చూసుకో అంటాడు.
అప్పుడు రవి నేను ఎంతో కాలంగా అడ్మినిస్ట్రేటివ్ లోనే ఉన్నాను. నేను అందులోనే చేస్తాను అంటాడు. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు నేను అంటాడు చరణ్. ఇక మీరు మీ ఆఫీస్ వర్క్ చూసుకోండి అని స్టాఫ్ మెంబర్స్ అందరికీ చెప్తాడు. అప్పుడు కోపంతో రవి స్టాప్ అందరిముందు వాడు నా పరువు తీశాడు. నువ్వు రెండు రోజులు ఓపిక పడదాం అన్నావు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా లేకపోతే వాడి సంగతి చెప్పే వాణ్ని అని అంటాడు వాళ్ల నాన్న ప్రకాష్ తో. అప్పుడు దేవా వీడు ముందు నుండే ఇలా మన తో ఆడుకుంటున్నాడు. ఇక తర్వాత రోజుల్లో ఏం చేస్తాడో అంటాడు. అప్పుడు ప్రకాష్ వాడితో గొడవలకి పోవద్దు సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. పదండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మాల ఈ చరణ్ మామూలోడు కాదు ఇంట్లో విలువైన వస్తువులను అన్ని దో చేస్తాడు. అని తన నగలను బాగ్ లో సర్దుకుంటుంది. ఇక చంద్ర ఆఫీస్ వర్క్ చేస్తుంటే లాగ్ అవుట్ అని వస్తుంది. తను వెంటనే ఆఫీస్ కి కాల్ చేసి అడుగుతుంది.
Kalisi Unte Kaladu Sukham July 18 Today Episode : సొంత బిడ్డలా చూస్తే ఇంత మోసం చేస్తావా.. చరణ్‌ను నిలదీసిన గీత
అప్పుడు మీ జాబ్ చేంజ్ అయింది మేడం అంటాడు. అదేంటి నా జాబ్ చేంజ్ కావడం ఏంటి అని అడుగుతుంది చంద్ర. అవును మేడమ్ మిమ్మల్ని ఫైనాన్స్ సెక్షన్ నుండి అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కి మార్చారు. అలా ఎవరు చేశారు అని అడగగానే ఎవరో కొత్త బాస్ వచ్చారు అని అంటాడు. ఒకసారి అతనికి కాల్ ఇవ్వు అంటుంది చంద్ర. అప్పుడు చరణ్ ఫోన్ తీసుకుంటాడు. ఎవరు నువ్వు అని అడగగానే ఏంటి ఆంటీ నా వాయిస్ గుర్తుపట్టలేదా నేను చరణ్ ని అని అంటాడు. అప్పుడు చంద్ర నీకేం రైట్స్ ఉన్నాయని నువ్వు ఎక్కడ ఉన్నావ్ నా జాబ్ చేంజ్ చేయడానికి అసలు నువ్వు ఎవరు అని అంటుంది. హక్కుల గురించి చట్టాల గురించి మీ వాళ్లకు చెప్పాను ఒకసారి వారికి ఫోన్ చేసి కనుక్కోండి. ప్రతి ఒక్కరికి ఇలా చెప్పాలంటే నా గొంతు నొప్పి పెడుతుంది అంటాడు చరణ్.
ఇకనుండి మీరు ఆఫీస్ కి వచ్చి స్టాఫ్ మెంబర్స్ తో గట్టిగా పని చేయించండి అని అంటాడు చరణ్. అప్పుడు చంద్ర నేను వర్క్ ఫ్రం ఫోన్ చేస్తున్నాను నేను ఆఫీస్ కి రాను అంటుంది. డబ్బుల లెక్కలు అయితే ఇంట్లో లాప్టాప్ ముందు కూర్చొని చేయొచ్చు. కానీ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ అంటే ఆఫీస్ కి రాక తప్పదు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దేవా గారు లంచ్ చేస్తుంటే చరణ్ అక్కడికి వచ్చి హలో సార్ ఏంటి ఫుడ్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేశారా. దానికి ఎంత ఖర్చయింది అని అడగగానే 500 రూపీస్ అంటాడు. అప్పుడు చరణ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కింద ఒక వ్యక్తి భోజనానికి 120 రుపీస్ కేటాయించారు. కానీ మీరు ఫైవ్ రుపీస్ ఖర్చు పెడుతున్నారు. మిగతా 380 రూపీస్ మీ జేబు నుండి ఖర్చు పెడతారా అని అంటాడు. అప్పుడు దేవా ఏంటి ఇంత చిన్న ఎమౌంట్ కి అలా చేస్తున్నావ్ అంటాడు. వెంటనే చరణ్ ఒక పెద్ద పడవ ని ముంచడానికి ఒక చిన్న రంద్రం చాలు. అలాగే ఒక కంపెనీ మూత పడటానికి ఇలాంటి దుబారా ఖర్చులు చాలు అని అంటాడు.

Kalisi Unte Kaladu Sukham July 18 Today Episode
ఇలాంటి చిన్నచిన్న ఖర్చులే అని వదిలేస్తే లక్షల్లో అవుతాయి. ఇకనుండి ఇలాంటి ఆర్డర్లు చేయడానికి వీలు లేదు అని అంటాడు. అప్పుడు ప్రకాష్ అక్కడికి వచ్చి మా తమ్ముడి నోటి దగ్గర ఉన్న కూడు ని కూడా అలాగే లాగేసుకుంటూ ఉంటావా? మా నాన్న పరువు పోతుందన్న ఒకే ఒక్క కారణంతో నేను సైలెంట్ గా ఉంటున్నాను అంటాడు. పదండి మనం బయట తిందాం అని చెప్పి దేవా ను మరియు రవిని తీసుకుని వెళుతూ చరణ్ తో అరే మీ నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ నీకు అన్నం పెట్టింది. నువ్వు ఇప్పుడు కనీసం కృతజ్ఞత కూడా చూపించట్లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి పోతాడు ప్రకాష్.
అక్కడ నుండి చరణ్ తన ఆఫీస్ రూమ్ లోకి వచ్చి రంగనాథ్ గారి ఫోటో వైపు చూస్తూ మీరు కూడా అందరిలాగే నన్ను అపార్థం చేసుకుంటున్నారా సార్ అని బాధపడుతూ ఉంటాడు. కానీ నేను మాత్రం మీ కృతజ్ఞత తీర్చుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నాను అని అంటాడు.మీ కుటుంబాన్ని బాధ పెడుతున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ తప్పట్లేదు సార్. మీ పిల్లల నోటి దగ్గర అన్నం తీసుకునేంత దుర్మార్గుడిని కాదు. కుటుంబం బాగుండాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది దయచేసి అర్థం చేసుకొని నన్ను మీ పెద్ద మనసుతో దీవించండి అంటూ తన ఫోటో వైపు చూస్తే ఎమోషనల్ అవుతాడు. ఆఫీస్ లో జరిగిన విషయం తెలుసుకున్న గీత చరణ్ పై విరుచుకు పడుతుంది. ప్రకాష్ నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నాడు అలాంటి వాడిని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దాం.
Read Also : Janaki Kalaganaledu: అందరి ముందు సరసాలు ఆడుతున్న జానకి, రామచంద్ర.. కుళ్లుకుంటున్న మల్లిక..?