Janaki Kalaganaledu : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జానకి తన తండ్రి ఫోటో ముందు మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా జ్ఞానాంబ వింటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇక నా చదువు విషయాన్ని ఇక మనం వదిలేద్దాం అనడంతో రామచంద్ర అలా మాట్లాడకండి అని అంటాడు. అప్పుడు జానకి ఇకపై నా చదువు విషయం గురించి ప్రస్తావించకండి అంటూ రామచంద్ర కు చేతులెత్తి మొక్కుతుంది. ఆ తర్వాత జానకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జ్ఞానాంబ ఒంటరిగా కూర్చుని జానకి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి రామచంద్ర,జానకి బుక్స్ తీసుకొని వచ్చి ఆ బుక్స్ ని జ్ఞానాంబ ముందు పెట్టి జానకి గారు ఐపిఎస్ చదువుని వదిలేస్తాను అని నిర్ణయం తీసుకున్నారు అమ్మ ఇక పై నా విషయంలో మీరు భయపడాల్సిన పనిలేదు అని చెబుతాడు రామచంద్ర. ఆ తర్వాత రామచంద్ర,జానకి గురించి ఎమోషనల్ గా మాట్లాడతాడు. కానీ జ్ఞానాంబ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
ఇంతలోనే అక్కడికి గోవిందరాజులు, జానకి, అలాగే కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. అప్పుడు రామ చంద్ర, జానకి గురించి,జానకి ఐపీఎస్ కల గురించి బాధగా చెబుతూ ఉంటాడు. కానీ జ్ఞానాంబ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు కూడా జానకి ఒక గొప్పతనం గురించి జ్ఞానాంబ చెబుతూ ఉంటాడు. అప్పుడు జానకి స్థానంలో మన కూతురు వెన్నెల ఉంటే ఏం చేస్తావో ఒక్కసారి ఆలోచించు అని అంటాడు.
ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా జ్ఞానాంబ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఆ బుక్స్ ని తీసుకొని స్వీట్ షాప్ లో పొట్లాలు కట్టడానికి పనికొస్తాయి అనుకోలేదమ్మా అని తీసుకుని వెళుతూ ఉంటాడు. అది చూసి మల్లిక నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర బుక్స్ తీసుకొని గడప దాటుతూ ఉండగా ఎంతలో జ్ఞానాంబ రామా అని పిలుస్తుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
అప్పుడు జ్ఞానాంబ రామచంద్రని దగ్గరికిరా అని పిలిచి ఆ బుక్స్ అక్కడ పెట్టు అని చెబుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ అలాగే చూస్తూ ఉండిపోతారు. అప్పుడు జ్ఞానాంబ మాట్లాడుతూ ఈరోజు వీళ్లు సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం నా పెద్దకొడుకు చదువును త్యాగం చేయడమే అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జ్ఞానాంబ, రామచంద్ర గురించి గొప్పగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది.
నా కొడుకు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అందుకే నేను ఒకరి నిర్ణయానికి వచ్చాను. జానకి ఐపీఎస్ చదవడానికి నేను ఒప్పుకుంటున్నాను అనడంతో అందరూ ఒక్కసారిగా సంతోషపడతారు. అప్పుడు రామచంద్ర, జానకి ఇద్దరు మరింత సంతోష పడుతూ ఉండగా మల్లిక మాత్రం అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే జ్ఞానాంబ దానికి జానకి కొన్ని షరతులు ఒప్పుకోవాలి అని అంటుంది. అప్పుడు షరతులు ఎందుకమ్మా అని రామచంద్ర అడగక నీకోసమే అని అంటుంది.
జానకి విషయం గురించి నువ్వు ఎంత బాధ పడ్డావో అదే విధంగా నా కొడుక్కి ఏమైనా జరిగితే నేను అంతే బాధపడతాను అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజులు నచ్చజెప్పి ప్రయత్నం చేయగా జ్ఞానాంబ రామచంద్ర విషయంలో భయపడుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ పెద్ద కోడలిగా నువ్వు ఇంటి బాధ్యతలు నెరవేర్చాలి.
అందరూ నిన్ను చూసి నడుచుకునే విధంగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు నీ భర్తని తక్కువ చేసి చూడకూడదు. భార్యగా భర్తకు అందించాల్సిన ప్రేమానురాగాలు నీ భర్తకు దూరం కాకూడదు అని అంటుంది. ఈ ఇంటికి వారసుడిని ఇవ్వడానికి నీ చదువు ఆటంకం కాకూడదు అని అంటుంది. నేను చెప్పిన షరతుల్లో ఏ ఒక్కటి నువ్వు తప్పిన నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది అని అంటుంది జ్ఞానాంబ.
Read Also : Janaki Kalaganaledu: రామచంద్ర కు ఇచ్చిన మాటను తప్పిన జానకి.. బాధలో జ్ఞానాంబం..?