Janaki Kalaganaledu: జానకికి షరతులు విధించిన జ్ఞానంబ… ఇరికించే ప్రయత్నం చేస్తున్న మల్లిక!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.ఇక ఈ సీరియల్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతున్న విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుని మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. జానకి చదువుతున్న విషయం తెలుసుకున్న జ్ఞానం తనకు షరతులు విధించిన విషయం తెలిసిందే.మరి నేటి ఎపిసోడ్ లో ఈ సీరియల్ ఎలా కొనసాగనుందనే విషయానికి వస్తే…

జానకి చదువుతున్న విషయం తెలిసిన జ్ఞానంబ తనపై ఎంతో కోపం తెచ్చుకొని ఉంటుంది. అయితే అందరూ చెప్పడంతో తన కోపాన్ని తగ్గించుకొని జానకికి ఐదు షరతుల విధిస్తుంది.ఈ క్రమంలోనే ఐదు సంఖ్యలను గోడపై రాసిన జ్ఞానంభ నువ్వు కనుక ఐదు తప్పులను చేస్తే ఆ తర్వాత నీ చదువు పట్ల నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి అంగీకరించాల్సిందేనని చెబుతుంది. ఇక జానకి కూడా తన అత్తయ్య పెట్టిన షరతులకు ఒప్పుకుంటుంది. ఇక తన చదువుకు తన అత్తయ్య ఒప్పుకుందని తెలిసి జానకి సంతోషంగా ఉండగా రామ మాత్రం ఆందోళన పడుతుంటారు.

Advertisement

రామా గారు ఎందుకు అలా ఉన్నారని అడగగా అమ్మ విధించిన షరతుల గురించి ఆలోచిస్తున్నాను అంటూ చెబుతాడు. వాటి గురించి మీరు ఆలోచించడం మర్చిపోండి ఇప్పుడు మనం సంతోష పడాల్సిన సమయం. అత్తయ్య గారు నా చదువుకు ఒప్పుకుంది అంటూ జానకి రామతో చెబుతుంది.మరోవైపు మల్లిక మాత్రం జానకి చదువుకు జ్ఞానాంబ ఒప్పుకోవడంతో తన భర్త విష్ణుకు లేనిపోని మాటలు చెప్పి తన మనసును మార్చే ప్రయత్నం చేస్తుంది.మీ అమ్మగారు ఆ జానకి చదువు కోసం ఒప్పుకున్నారు కానీ మనం పట్నం వెళ్దామంటే మాత్రం ఒప్పుకోలేదు.

రేపు జానకి చదివి ఐపీఎస్ అయితే తనకు పట్నంలో పెద్ద ఇల్లు ఇస్తారు. అప్పుడు బావ గారు కూడా స్వీట్ షాప్ మూసేసి ఎంచక్కా పట్టణంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. మనం మాత్రం ఇక్కడే ఇలాగే ఉండాలి అంటూ లేనిపోని మాటలు చెప్పి విష్ణు మనసు మారుస్తుంది. మల్లిక మాటలు విన్న విష్ణు కూడా కాస్త ఆలోచనలో పడతాడు.మరుసటి రోజు ఉదయం జానకి చదువుకోవాలని నిద్ర లేచి బుక్స్ కోసం వెతకగా అక్కడ తన బుక్స్ కనిపించవు.

Advertisement

తన బుక్స్ ఏమయ్యాయని ఆలోచిస్తూనే రామా గారిని నిద్ర లేపుతుంది. మల్లిక మాత్రం జానకి పుస్తకాలు తీసుకొని జ్ఞానాంబ బీరువాలో తాను ఎంతో పవిత్రంగా చూసుకొనే తోరణాలను పక్కకు పెట్టి తన పుస్తకాలను తన అత్తయ్య బీరువాలో పెడుతుంది. అది చూసిన జ్ఞానంభ ఒక్కసారిగా జానకి పై ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది చూసిన మల్లికా ఎంతో సంతోషపడుతుంది. ఇలా జానకి 5 తప్పులు తొందరగా చేసేలా ఆమె జానకిని ఇరికిస్తూ ఉంటుంది.మరి తదుపరి ఎపిసోడ్లో జ్ఞానాంబ జానకి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement