Lakshmi Pranathi: నందమూరి నట వారసుడిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది బాలకృష్ణ మొదటి వారు కాగా.. రెండోవారు జూనియర్ ఎన్టీఆర్ యే. రూపంలోనే కాదు నటనలోనూ తాతకు ఏమాత్రం తీసిపోడు. తాగాజా ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మనకు తెలుసు. అయితే లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్ లు పెళ్లికి ముందు బంధువులేనట. వీరిద్దరి పెళ్లి కన్నులపండువగా జరిగింది. అయితే లక్ష్మీ ప్రణతి తన కట్టు బొట్టుతో ఎన్టీఆర్ గౌరవాన్ని మరింత పెంచింది. అయితే లక్ష్మీ తారక్ ను చేస్కోవడానికి చాలా కండీషన్లే పెట్టిందట. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి జరిగిన తర్వాత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీ కోసం సమయం కేటాయింటాలని చెప్పిందట. అలాగే పెళ్లైన తర్వాత స్నేహితులతో కలిసి బయట తిరగడం తగ్గించాలని కోరిందట. అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్లేటప్పుడు వేస్కునే బట్టలు తానే సెలెక్ట్ చేస్తానని అందట. అంతే కాదు తారక్ ఫుడ్ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. వీటన్నిటికి యంగ్ టైగర్ ఓకే చెప్పాకే లక్ష్మీ తారక్ ను పెళ్లి చేస్కుంది. ప్రస్తుతం వీరిద్దరూ పిల్లాపాపలతో చాలా సంతోషంగా గడుపుతున్నారు.