Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఫుడ్ కాంపిటీషన్ వాళ్లు కొత్త కొత్త రకాల పుడ్స్ పేర్లు చెప్పడంతో రామచంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర పుట్ట కాంపిటీషన్ వారు చెప్పిన పేరును మొదటిసారిగా వింటున్నాను అవి నేను ఎలా చేయగలను అని తనలో తాను టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు జానకి ఏమి కాదు భయపడొద్దు అని చెప్పి రామచంద్రకు ధైర్యం చెబుతుంది. మరొకవైపు అదంతా టీవీలో చూస్తున్న గోవిందరాజు జానకి ఉండగా రాముడు ఎలా ఓడిపోతాడు అనుకుంటున్నావు జ్ఞానాంబ అని అంటాడు.
ఆ తర్వాత జడ్జి వచ్చి రామచంద్ర చేసిన ఫుడ్డు ని ఇది నువ్వు చేసిన డిష్ ఇంకా పూర్తి కాలేదు అని అనడంతో ఈ రకమైన వంటల గురించి నాకు తెలియదు అనగా అప్పుడు జడ్జి నెక్స్ట్ రౌండ్ కి బెటర్ లక్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గజ్జి సంజయ్ రామచంద్ర ని కూడా ఈ రౌండ్ లో ఎలిమినేట్ చేస్తూ రేపటి రౌండ్ లో మీకు చాలా టఫ్ గా ఉండబోతుంది అని చెబుతాడు.
అదంతా చూసిన జ్ఞానాంబ నా కొడుకుకి అవమానం అనే గ్రహణం పట్టుకుంది అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు జానకి రేపు ఎపిసోడ్ లో రామ గారు గెలవకపోతే నేను అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర నాకు రేపు రౌండ్ లో ఎలా అయిన ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని అంటారు.
ఆ తర్వాత రామచంద్ర తో పాటు పోటీ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ లు రామ ను చదువురాని వాడు అంటూ అవమానపరుస్తూ ఉండగా ఇంతలో జానకి అక్కడికి వచ్చి మీకు సంస్కారం లేదు అంటూ వారిపై విరుచుకు పడుతుంది. ఆ తర్వాత జానకి రామచంద్రను అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీరియల్ నటుడు మహేష్ ని జడ్జిగా ఆహ్వానిస్తారు.
ఆ తర్వాత జడ్జ్ సంజయ్ మాట్లాడుతూ ఈరోజు మీకు ఛాయిస్ మీకు ఏది ఇష్టమైతే అది తయారు చేయండి అని అంటాడు. ఈరోజు ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తారు మీరందరూ వంటకాలు తయారు చేయాలి అని అంటాడు. టూరిస్టులు అందరూ వచ్చి మీరు చేసిన పదార్థాలు కొనుక్కుంటారు అని అంటాడు.
అయితే ఎవరి పదార్థాలు అయితే ఎక్కువగా అమ్ముడు పోయే వాళ్ళ గెలిచినట్లు అని అనడంతో రామచంద్ర ఫుడ్ చేయడం మొదలుపెడతాడు. అప్పుడు జానకి తన భర్తకు సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World