Janaki Kalaganaledu july 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జానకిని ప్రేమతో దగ్గర తీసుకుని ముదుటిపై ముద్దు పెడతాడు. ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ వాళ్లు గుడి దగ్గర నుంచి రాగానే వెంటనే జ్ఞానాంబ జానకి రూమ్ దగ్గరికి వెళ్లి జానకిని పిలుస్తుంది. అప్పుడు జానకి రామచంద్రను నిద్ర లేపగా అప్పుడు రామచంద్ర తన కాలు చేయి జానకి పై ఉండటం చూసి టెన్షన్ పడతాడు. అప్పుడు రామ చంద్ర జానకి గారు ఆగండి అంటూ ఉండగా అప్పుడు జానకి సిగ్గుపడుతూ వెళ్లి డోర్ తీయడంతో జ్ఞానాంబ నవ్వుతూ ఉంటుంది.

అప్పుడు జ్ఞానాంబ పక్కకు వెళ్లి జానకిని మీ ఇద్దరి మనసులు కలిసాయా అని అడగగా జానకి కలిసాయి అని అపద్దం చెబుతుంది జానకి. వారి మాటలు విన్న మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్ఞానాంబ అటువైపు రాంచి రావడంతో మల్లికా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రామచంద్ర జానకి తో మాట్లాడుతూ ఉండగా ఇంతలో పనిమనిషి అక్కడికి వచ్చి వారిని నవ్వుతుంది.
Janaki Kalaganaledu july 14 Today Episode : రామా, జానకి శోభనం జరిగిందా… వారసుడు రాబోతున్నాడా?
అప్పుడు రామచంద్ర సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మల్లికా జరిగిన విషయం చెప్పకుండా అబద్ధం చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ అక్కడనుంచి వెళ్లిపోగా మల్లిక మళ్లీ బయటకు వచ్చి నా పర్ఫామెన్స్ అదిరిపోయిందా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత రామచంద్ర రూంలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు రామచంద్ర జానకి దగ్గరికి వెళ్లి ఏంటండీ ఇదంతా అని అడగగా వెంటనే జానకి చేయాల్సినంత చేసి ఏంటని అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది. అప్పుడు రామచంద్ర ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉండగా అది చూసి జానకి నవ్వుకుంటూ ఉంటుంది.
ఆ తరువాత రామచంద్ర జానకి మాటలకు సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత జ్ఞానాంబ భోజనం సిద్ధం చేసి తినడానికి రమ్మని చెబుతుంది. అప్పుడు మల్లికా ఓవరాక్షన్ చేస్తూ అక్కడికి వెళుతుంది. ఆ తర్వాత అందరూ అక్కడికి రావడంతో పాయసం ఇస్తుంది జ్ఞానాంబ.
కానీ రామచంద్ర మాత్రం జరిగిన పట్ల జానకి పై కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ వారసుడు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాను అంటూ బాధపడుతుంది. ఆ తరువాత జానకి,రామ చంద్ర జానకి వైపు అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జ్ఞానాంబ దేవుడి దగ్గరికి వెళ్లి ఇవ్వు తండ్రి అని దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జ్ఞానాంబ, గోవిందరాజులు కొడుకు కోడళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న జానకి బాధపడుతూ ఉంటుంది.
Read Also : Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ రివర్స్.. జానకిని దూరం పెడుతున్న రామచంద్ర..?