Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ రివర్స్.. జానకిని దూరం పెడుతున్న రామచంద్ర..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి రామచంద్రలు ఏకాంతంగా గడపడం కోసం ప్లాన్ చేస్తారు జ్ఞానాంబ దంపతులు.

ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక వాళ్ళ గదిలో కూడా జ్ఞానాంబ వాళ్ళు పూలతో డెకరేషన్ చేసి ఉంటారు. అది చూసి మల్లికా జానకి గదిలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారా అని అనుకుంటుంది. ఎలా అయినా జానకి వాళ్ళ ఏకాంతాన్ని పాడు చేయాలి అని ప్లాన్ ను వేస్తుంది మల్లిక. ఇక మల్లికా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మధ్య మధ్యలో విష్ణు సెటైర్స్ వేస్తూ ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత మల్లికా వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న పాలు గ్లాసులో నిద్ర మాత్రలు కలుపుతుంది. ఇంతలో అక్కడికి రావడంతో మల్లిక నిద్రమాత్రలు కలిపిన విషయం ఎక్కడ చూసిందో అని మల్లికా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ విషయాన్ని కవర్ చేయడం కోసం జానకి నీ చీర బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇస్తుంది మల్లిక. ఆ తర్వాత మల్లికా మనం త్వరగా పిల్లల్ని కానీ అత్తయ్య చేతిలో పెట్టాలి ఆమె కోరిక తీర్చాలి అని అంటుంది.

ఆ తర్వాత జానకి పాల గ్లాస్ ని తీసుకొని రూమ్ కి వెళుతుంది. ఆ తర్వాత మల్లిక విష్ణు దగ్గరికి వచ్చి కొత్త కొత్తగా మాట్లాడుతూ ఉంటుంది. మల్లికా ప్రవర్తనను గమనించిన విష్ణు ఏదో జరిగింది తేడాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విష్ణు పాలు కొన్ని తాగి కొన్ని మల్లికకు ఇస్తాడు.

అప్పుడు మల్లికా పాలు తాగుతున్న జానకి వాళ్ళు పాలు తాగారు లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో వైపు జానకి దంపతులు పాలు తాగి స్పృహ తప్పి పడిపోతార. అది అయితే అదంతా జరిగినట్టు మల్లికా ఊహించుకుంటుంది. మల్లికా ఆ కళ్ళలో నుంచి తీరుకునేసరికి విష్ణు నిద్ర పోతాడు. ఇప్పుడు జరిగిన విషయం గుర్తు తెచ్చుకోగా తాను కలిపిన మందు గ్లాసు తానే తీసుకుని వెళుతుంది.

Advertisement

మరొకవైపు జానకి పాల గ్లాస్ తీసుకొని రావడంతో రామచంద్ర మాత్రం మీ చదువు కల నెరవేరిన తర్వాతే అమ్మ కోరిక తీరుద్దాం అని అనడంతో ఆ తర్వాత ఇద్దరూ ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఒకరు తాగిన పాలను మరొకరు తాగుతారు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel