Janaki Kalaganaledu june 22 episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, రామచంద్ర ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ, రామచంద్ర ఇంటర్వ్యూ గురించి టెన్షన్ పడుతూ ఉండగా జానకి వచ్చి ధైర్యం చెబుతుంది. అంతే కాకుండా మీ హుందాతనంతో వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కూడా భయపడతారు అంటూ జ్ఞానాంబ మనసులో ఉన్నభయాన్ని పోగొడుతుంది. మరొకవైపు మల్లిక అద్దం ముందు నిలబడి ఫోజులు ఇస్తూ తన అందాన్ని పొగుడుతూ మురిసి పోతూ ఉంటుంది.
ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి మల్లిక పై సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటర్వ్యూ కి వెళ్తారు. ఇంటర్వ్యూలో జ్ఞానాంబ టెన్షన్ పడుతూ ఉండగా జానకి మళ్లీ ఏమి కాదు అని ధైర్యం చెబుతుంది.
ఆ తర్వాత మల్లికా కెమెరా ముందు నిలబడి ఓవరాక్షన్ చేస్తూ మైక్ తీసుకుని మా బావ గారు చెక్ కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు నేను కొన్ని టిప్స్ ఇచ్చాను ఆ టిప్స్ వల్లే మా బావ గారు పోటీలో గెలిచారు అంటూ ఓవర్ గా మాట్లాడుతుంది. అప్పుడు జ్ఞానాంబ గట్టిగా అరవడంతో మల్లిక సైలెంట్ గా ఉండిపోతుంది.
అనుకున్న విధంగా ఇంటర్వ్యూ సక్సెస్ ఫుల్ గా ముగుస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూ చేసిన యాంకర్ రామచంద్ర ని అలాగే జ్ఞానాంబ, జానకి లో కూడా పోగొడుతుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి వెన్నెలలో అల్లా చల్లగా మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు జానకి ఆలోచనల్లో పడి చదువు మరచి పోయింది అని గుర్తు చేసుకున్న రామచంద్ర వెంటనే వెళ్ళి బుక్ తీసుకుని వచ్చి ఇవ్వగా అప్పుడు జానకి మీరు గెలిచిన ఆనందాన్ని ఈరోజు ఆస్వాదిస్తాను రేపటి నుంచి చదువుకుంటాను అని అంటుంది. మరుసటి రోజు జ్ఞానాంబ కుటుంబం మొత్తం గుడికి బయలుదేరుతారు.
అక్కడ జ్ఞానాంబ కుటుంబానికి ఊరి ప్రజలు కొంతమంది ఎదురుపడి జ్ఞానాంబ, రామచంద్ర, జానకి లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉండడంతో మల్లికా కుళ్ళు కుంటూ ఉంటుంది. ఆ తర్వాత మల్లిక జానకి పై లేనిపోని మాటలు అని చెప్పడంతో జ్ఞానాంబ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది.
ఆ తరువాత గుడి లో అర్చన కోసం రామచంద్ర డబ్బులు ఇస్తూ ఉండగా ఇంతలో పూజారి అక్కడికి వచ్చి మీ కుటుంబం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వరలోనే జరగబోయే ధ్వజస్తంభం కార్యక్రమానికి మీ కోడలు మీ పేరు మీద కొంత విరాళం ఇచ్చారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా సంతోషంగా ఫీల్ అవుతారు.
Read Also : Janaki Kalaganaledu: సంతోషంలో జ్ఞానాంబ కుటుంబం.. లీలావతి పై మండిపడ్డ మల్లిక..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World