Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర జానకి ఇద్దరూ కన్నబాబు ఇంటికి వెళ్లి వారి డబ్బులు ఇస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి వాళ్లు డబ్బులు కట్టిన తరువాత కన్నబాబు సాక్షి పత్రం ఇవ్వగా వెంటనే జానకి ఆ పేపర్ చింపి కన్నబాబు సునంద లకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తన భర్త ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని మా ఆయనకు అండగా తాను ఉంటానని, మా ఆయనను ఎవరైనా ఏమైనా చేయాలి అంటే ముందు నన్ను దాటుకుని వెళ్లాలి అంటూ వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత రామచంద్ర కూడా కన్నబాబు కు వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు సునంద కన్నబాబు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో జానకి రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా రామచంద్ర అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు జానకి ఏమయింది అని అడగగా రామచంద్ర నువ్వు ఒక మాట చెబితే దానికి ఒప్పుకోవు అని అనడంతో ఏంటి అని అడుగుతుంది జానకి.
అలా వారిద్దరూ మాట్లాడుకున్న తరువాత జానకి థాంక్స్ చెబుతూ రామచంద్ర నుదిటి పై ముద్దు పెట్టగా రామచంద్ర కూడా జానకి ముద్దు పెడతాడు. ఆ తరువాత లీలావతి నడుచుకుంటూ వెళుతూ ఉండగా మీడియా వాళ్లు వచ్చి రామచంద్ర ఇంటి అడ్రస్ అడిగి అక్కడికి వెళ్తారు. ఇక మీడియా వాళ్ళని చూసి జ్ఞానాంబ కుటుంబం ఆనందపడుతూ ఉంటుంది.
కానీ మల్లిక మాత్రం కుళ్ళు కుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ వాళ్లు రామచంద్ర ను ప్రశ్నలు అడగడానికి అంగీకరించదు. కానీ గోవిందరాజులు జానకి మాత్రం ఇంటర్వ్యూ చేయాలి అని అంటారు. ఇక ఆ తర్వాత మల్లిక మీడియా వాళ్లను పిలుచుకొని వచ్చినందుకు లీలావతి పై మండిపడుతుంది.
అప్పుడు నువ్వు కూడా టీవీ కో కనిపిస్తావు అని మల్లికకు లీలావతి చెప్పడంతో ఇక అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జానకి రామ చంద్రని సిద్ధం చేస్తుంది. ఇక జ్ఞానాంబ ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ ఉండగా జానకి వెళ్లి జ్ఞానాంబ అమ్మకు ధైర్యం చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World