Devatha Serial Oct 15 Today Episode : రాధ మీద పెత్తనం చెలయించాలి అనుకుంటున్న మాధవ్.. వార్నింగ్ ఇచ్చిన రామ్మూర్తి.?

Updated on: October 15, 2022

Devatha Serial Oct 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ,భాగ్యమ్మ పిల్లలు కలసి తోటకి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో రాధభాగ్యమ్మ ఇద్దరూ నాగలి పట్టుకుని దున్నుతూ ఉండడం చూసి పిల్లలు సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు పిల్లలు రాధాకృష్ణ చూసి అమ్మ మేము కూడా నీకు హెల్ప్ చేస్తాము అని అనగా రాద వద్దు మేము చేస్తా మీరు చూస్తూ ఉండండి అనడంతో లేదమ్మా మేము కూడా నీతో పాటు కష్టపడతాము అని చెప్పి రాధ తో పాటు కలిసి పని చేస్తూ ఉంటారు.

Devatha Serial Oct 15 Today Episode
Devatha Serial Oct 15 Today Episode

పక్కనే ఉన్న భాగ్యమ్మ పిల్లలను రాధని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు గతంలో రుక్మిణి,తాను కలసి పొలం దున్నుతున్న విషయాలని గుర్తుతెచ్చుకొని ఆనంద పడుతూ ఉంటుంది భాగ్యమ్మ. అప్పుడు పిల్లలు భూమికి సంబంధించిన వివరాలను ఎలా పండిస్తారు అని అడగడంతో రాధ చక్కగా వివరిస్తూ ఉంటుంది. అప్పుడు చిన్మయి అమ్మ నిజంగా రైతులు చాలా కష్టపడాలి అని అనగా అప్పుడు రుక్మిణి రైతుల గురించి, నేలతల్లి గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది.

మరొకవైపు మాధవ పైనుంచి దిగుతూ ఉంటాడు. ఇక జానకమ్మ ముందుకు వెళ్లాలి అని కుర్చీలో ముందుకు వెళ్ళడానికి అవస్థలు పడుతూ ఉంటుంది. అప్పుడు మాధవ్ జానకి దగ్గరికి వచ్చేసరికి జానకి అనుకోకుండా కుర్చీలోంచి కింద పడిపోతుంది. దాంతో మాధవ్ గట్టిగా అమ్మ అని అరవడంతో రామ్మూర్తి కూడా అక్కడికి వచ్చి వారిద్దరూ కలిసి ఆమెను కుర్చీలో కూర్చోబెడతారు.

Advertisement

Devatha అక్టోబర్ 15  ఎపిసోడ్ : నాగలి పట్టుకుని పొలం దున్నిన ఆదిత్య,రాధ..

అప్పుడు రామ్మూర్తి నీ కర్రను వదిలేసి వచ్చావు ఏంట్రా అని అడగగా అమ్మ కింద పడిపోయేసరికి కర్ర చేతిలో నుంచి పడిపోయింది అన్న విషయాన్ని కూడా మరిచిపోయాను నాన్న అని అంటాడు. అప్పుడు మాధవ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రామ్మూర్తి మాధవ్ గురించి గొప్పగా చెబుతూ నువ్వే వాడిని తప్పుగా అపార్థం చేసుకున్నావు జానకి అని అంటాడు. కానీ జానకి అసలు విషయం ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటుంది.

మరొకవైపు పిల్లలిద్దరితో కలిసి రాధ పొలంలో పనిచేస్తూ ఉండగా ఎంతలోనే అక్కడికి ఆదిత్య వస్తాడు. అప్పుడు వారందరూ సంతోష పడుతూ ఉంటారు. ఇక పిల్లలు ఆదిత్య దగ్గరికి వెళ్ళగా ఆదిత్య దేవి ని ఎంత మాట్లాడించినా కూడా దేవి మౌనంగా మాట్లాడకుండా ఉంటుంది. ఏం జరిగింది ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని అడిగినా కూడా ఎంత చెప్పినా కూడా దేవి మౌనంగానే ఉంటుంది. ఇప్పుడు చిన్మయి దేవి మాట్లాడాలి అంటే ఆఫీసర్ సారు అమ్మతో కలిసి పొలం దున్నాలి అని అనడంతో సరే పద అని అంటాడు ఆదిత్య.

ఆ తర్వాత వారందరూ కలిసి పని చేస్తూ ఉంటారు. ఆదిత్య ఒకవైపు , రాధ ఒకవైపు నాగలి పట్టుకుని దున్నుతూ ఉంటారు. మరొకవైపు మాధవ రాధ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళాడు అని తెలుసుకుని రామ్మూర్తితో ఎందుకు పంపించావు నాన్న అని రామ్మూర్తిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు మాధవ తన మాటలతో రాదని పెత్తనం చెలాయించాలి అనుకున్నట్లుగా మాట్లాడడంతో వెంటనే రామ్మూర్తి రాధ మీద పెత్తనం చెలాయించాలి అని చూస్తే బాగుండదు. అంతేకాకుండా మన వల్ల రాధక ఏ చిన్న కష్టం కలిగినా కూడా నేను సహించను అని మాధవకు వార్నింగ్ ఇస్తాడు రామ్మూర్తి.

Advertisement

Read Also : Devatha serial Oct 12 Today Episode : మాధవ నిజ స్వరూపం తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్య,రాధ లపై కోపంతో రగిలిపోతున్న సత్య..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel