వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Devatha: హాస్పిటల్లో జానకమ్మ.. మాధవ పై కోప్పడిన రామ్మూర్తి..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జానకి నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని అంటూ ఉండగా మాధవ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్లో జానకి కిందికి వెళుతూ ఉండగా మాధవ అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ ఓపిక నశించిపోయి కోపంతో జానకమ్మను మెట్ల పైనుంచి కిందికి తోసేస్తాడు. అప్పుడు జానకి గట్టిగా ... Read more

By Ramesh Babu

Published on: September 24, 2022 10:56 AM

Updated on: September 24, 2022 10:58 AM

Madhava tries to kill Janaki in todays devatha serial episode

---Advertisement---

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో జానకి నీ గురించి అందరికీ చెప్పేస్తాను అని అంటూ ఉండగా మాధవ బ్రతిమిలాడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్లో జానకి కిందికి వెళుతూ ఉండగా మాధవ అడ్డుపడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ ఓపిక నశించిపోయి కోపంతో జానకమ్మను మెట్ల పైనుంచి కిందికి తోసేస్తాడు. అప్పుడు జానకి గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. అప్పుడు మాధవ ఏం తెలియనట్టుగా జానకి చేతిలో ఉన్న తాళిబొట్టు ఆ లగ్నపత్రిక తీసుకొని జోబులో పెట్టుకుని అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ కిందికి వస్తాడు.

ఇంతలోనే అందరూ అక్కడికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటారు. జానకిని అలా చూసిన. రామ్మూర్తి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా దేవి,చిన్మయి భాగ్యమ్మ దగ్గర ఏడుస్తూ ఉంటారు. రాధా జానకి పరిస్థితి చూసి టెన్షన్ పడుతూ ఉండగా మాధవ మాసం నీకు నాకు మధ్యలో అడ్డు వస్తే మా అమ్మని విడిచి పెట్టలేదు చూసావు కదా అని కోపంగా చూస్తూ ఉంటాడు.

మరొకవైపు ఆదిత్య పడుకుని ఉండగా ఇంతలో రాధ ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో టెన్షన్ పడుతూ వస్తాడు ఆదిత్య. మరొకవైపు పిల్లలు ఇద్దరు నానమ్మకి ఏం కాకూడదు అని దేవుడిని ప్రార్థిస్తూ ఉండగా అక్కడికి వచ్చిన భాగ్యమ్మ ఏమి అవ్వదు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలోనే హాస్పిటల్ కి ఆదిత్య రావడంతో రామ్మూర్తి, ఆదిత్యని గట్టిగా పట్టుకుని ఏడుస్తాడు.

అప్పుడు మాధవ ఆఫీసర్ నీ అవసరం ఇక్కడ లేదు ఇంటికి వెళ్ళిపో అని అనడంతో వెంటనే రామ్మూర్తి మాధవ పై సీరియస్ అవుతాడు. మరొకవైపు సత్య ఆదిత్య గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. రాధను మరింత అపార్థం చేసుకుంటూ ఉంటుంది.

ఆ తర్వాత జానకమ్మకి మెలుకువ వస్తుంది. అప్పుడు నర్స్ వెళ్లి రాధను అని పిలవగా రాధకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా ఇంతలో మాధవ ఎదురుగా వచ్చి నిలబడడంతో మాధవని చూసి భయపడిన జానకి మరి స్పృహ కోల్పోతుంది. తెల్లారిగానే ఆదిత్య ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆదిత్య అబద్ధం చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్య మరింత అపార్థం చేసుకుంటుంది..

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel