Devatha Aug 31 Today Episode : ఆదిత్య,సత్యలను అమెరికాకు పంపిస్తానన్న దేవుడమ్మ..తండ్రికీ సేవలు చేస్తున్న దేవి..?

Updated on: August 31, 2022

Devatha Aug 31 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ రాధ పై పగ తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.  ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ దేవి బాధపడుతూ ఉండడంతో ఏం జరిగింది అని ఆదిత్య అడగగా దేవి జరిగింది మొత్తం చెప్పడంతో ఆదిత్య షాక్ అవుతాడు. అప్పుడు ఆదిత్య మీ నాన్న ఎక్కడున్నాడు అని అడగగా ఇప్పుడే వెళ్లిపోయాడు అని చెబుతుంది.

Devatha Aug 31 Today Episode
Devatha Aug 31 Today Episode

అప్పుడు దేవి ఎలా అయినా మా అమ్మను నాన్నను మీరే కలపాలి అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది దేవి. అప్పుడు ఆదిత్య బాధతో ఏమీ అనలేక దేవి మాటలకు సరే అని అంటాడు. మరొకవైపు భాగ్యమ్మ రాధ ఇద్దరు మాధవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు భాగ్యమ్మ నువ్వు ఇలా ఊరుకుంటున్నావు కాబట్టి వాడు అలా రెచ్చిపోతున్నాడు అనడంతో వెంటనే రాధ, చిన్మయి ని చూసి ఏమి చేయలేకపోతున్నాను అని అంటుంది.

Devatha Aug 31 Today Episode : తండ్రికీ సేవలు చేస్తున్న దేవి..?

నేను వాడిని చంపి జైలుకు వెళ్తాను అని అనడంతో అప్పుడు వ్యక్తిని వద్దు మాధవ బుద్ధి మారుతుందేమో చూద్దాం అని అంటుంది. మరొకవైపు సత్య, కమల పాపతో ఆడుకుంటూ ఉండగా అప్పుడు సత్య ని చూసి కమల బాధపడుతుంది. అప్పుడు కమల నీకు ఇలాంటి బిడ్డ పుడుతుంది. మీరు ఎలాగైనా అమెరికాకు వెళ్ళండి అనడంతో వెంటనే సత్య బాధతో ఆదిత్య ఏం చెప్పడం లేదు అక్క అని బాధపడుతుంది.

Advertisement

ఇంతలోనే దేవుడమ్మ అక్కడికి వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ నేను అమెరికా కు పంపిస్తున్నాను అని అనడంతో సత్య సంతోషపడుతుంది. ఆ తర్వాత రాధా పిల్లల్ని తీసుకుని రావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ దేవి తన తండ్రితో వెళ్ళింది అని తెలియడంతో, వెంటనే రాధ, ఆదిత్య కు జరిగిన విషయం చెప్పగా అప్పుడు ఆదిత్య నువ్వేం భయపడకు నేను దేవికి ఒక వాచ్ ఇచ్చాను ఆ వాచి దేవి ఎక్కడ ఉన్న ఇట్టే కనిపెట్టవచ్చు అని అంటాడు.

మరోవైపు దేవి తన తండ్రి కి జ్వరం రావడంతో వేడి నీళ్ల కాపురం పెడుతూ సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తాగుబోతు వ్యక్తి దేవి ముందు కావాలని నటిస్తూ మరింత ఎమోషనల్ గా డైలాగులు కొడతాడు. దేవి కూడా అతన్ని చూసి మరింత ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

Read Also : Devatha: రాధ కోపాన్ని చూసి భయపడిన మాధవ.. దేవి మనసు చెడగొట్టిన మాధవ మనిషి..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel