Devatha: రాధ కోపాన్ని చూసి భయపడిన మాధవ.. దేవి మనసు చెడగొట్టిన మాధవ మనిషి..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య ఆ తాగుబోతు వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాడు..

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య తాగుబోతు వ్యక్తి కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వచ్చి ఆదిత్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు. అప్పుడు ఆదిత్య కాలర్ పట్టుకోవడంతో నువ్వు రాధ ఇద్దరు పదేపదే నా కాలర్ పట్టుకుంటున్నారు. ఆ తర్వాత నేను ఏం చేస్తానో తెలిసి కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారు అని అనగా వెంటనే కోపంతో రగిలిపోయిన ఆదిత్య రే మాధవ్ ఊరుకునే కొద్ది చాలా రెచ్చిపోతున్నావు నేను నీ గురించి ఒక్క క్షణం గట్టిగా అనుకున్నాను అంటే నువ్వు అనే వాడివి ఉండవు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

Advertisement

నువ్వు నన్ను చంపిన కూడా నేను వాడెవడో చెప్పను అనటంతో వెంటనే ఆదిత్య నిన్ను చంపి నా బిడ్డను నా ఇంటికి తీసుకెళ్తాను. నా వరకు కూడా అవసరం లేదు నా బిడ్డతో నిన్ను చంపిస్తాను అంటూ మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు ఆదిత్య. ఒకవైపు దేవీ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి జానకి వచ్చి ఏం జరిగింది దేవి అని అడగడంతో అప్పుడు దేవి జానకి పై సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రాధ వస్తుంది.

ఇప్పుడు జానకి రాదా అని అడుగుతూ దేవి ఎందుకు అలా ఉంది అని అడగగా నాకు కూడా చెప్పలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ. మరోవైపు ఆదిత్య ఆ తాగుబోతు వ్యక్తిని ఎలా అయినా పట్టుకోమని చెప్పి వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి చెబుతాడు. ఆ తర్వాత రాధ ఒంటరిగా కూర్చొని దేవి మనసు ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వస్తాడు.

అప్పుడు మాధవ ఎప్పటిలాగే మాట్లాడి చివరిలో నువ్వు అనుకున్న విధంగానే దేవుని పంపిస్తాను కానీ నువ్వు ఒక చిన్న పని చేయాలి అని అంటాడు. దేవిని పంపించిన తర్వాత నువ్వు చిన్మయికి అమ్మగా నాకు భార్యగా ఉండాలి అనడంతో వెంటనే కోపంతో రగిలిపోయిన రాధ సారు అంటూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కొట్టబోతుంది. దీంతో మాధవ, రాధ కోపం చూసి ఒక్కసారిగా భయపడి పోతాడు.

Advertisement

ఇప్పుడురాధ నేను ద్రౌపది లెక్క కాదు చేతికి చేతులు పెట్టే రకం నేను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరొకవైపు దేవి స్కూల్ దగ్గర ఆడుకుంటూ ఉండగా ఆ తాగుబోతు వ్యక్తి వచ్చి దేవికి చాక్లెట్స్ ఇచ్చి దేవి మనసుని పాడు చేస్తాడు. కావాలని దేవి ముందు నటిస్తూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. ఇంతలోనే అతను అక్కడి నుంచి వెళ్తుండగా ఆదిత్యా ఎదురు వస్తాడు. మరొకవైపు రాధ మాధవ మీద కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన మాధవ ఎలా అయినా నీ అంతు చూస్తాను అని చెప్పి ఆ తాగుబోతు వ్యక్తికి ఫోన్ చేసి దేవిని నీతో పాటు తీసుకెళ్ళు నేను చెప్పే వరకు బయటకు తీసుకుని రాకు అని చెబుతాడు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel