Wikki Nayan: పెళ్లి జరిగి 4 నెలలు కూడా కాకముందే ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులం అయ్యామన్న నయనతార, విఘ్నేష్ దంపతుల పోస్టుతో ఒక్కసారిగా వివాదం రేగిన విషయం తెలిసిందే. పెళ్లైన తర్వాత నయనతార ఎక్కడా గర్భంతో ఉన్నట్టు కనిపించలేదు. అంటే సరోగసి ద్వారానే వీరు పిల్లల్ని కన్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియా సైట్లలో ఈ చర్చ తీవ్రరూపం దాల్చడంతో.. తాము సరోగసి పద్ధతి ద్వారానే పిల్లల్ని కన్నట్లు ప్రకటించారు ఈ సెలబ్రిటీ దంపతులు.
హనీమూన్ ట్రిప్పులతో తెగ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకున్న ఈ జంట.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది. చాలా మంది నెటిజన్లు వీరిద్దరికి వ్యతిరేకంగా నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.
సరోగసి పద్ధతిలో బిడ్డలకు జన్మనివ్వడాన్ని కఠినతరం చేసింది ప్రభుత్వం. సరోగసి పద్ధతి ద్వారా బిడ్డలను కనాలనుకుంటే దానికి పెద్ద తతంగమే ఉంటుంది. బిడ్డలను పుట్టే అవకాశం లేదన్నట్లుగా వైద్యుల ధ్రువపత్రాలు ఉండాలి. సాధారణ పద్ధతిలో పిల్లల్ని కనలేము అని ధ్రువీకరణ వచ్చిన తర్వాత సరోగసికి అనుమతి పొందాలి. ప్రభుత్వం నుండి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ పొందిన తర్వాతే సరోగసి ద్వారా బిడ్డలను కనాల్సి ఉంటుంది.
అయితే నయనతార, విఘ్నేష్ దంపతులు నియమ నిబంధనలు పాటించారో లేదో తెలియాల్సి ఉంది. ఏ రూల్స్ పాటించకపోతే నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేస్తారు. ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.