Karthika Deepam june 6 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎప్పటి నుంచో నెంబర్ వన్ రేటింగ్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ప్రస్తుతం కూడా టాప్ వన్ రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఇక ఈ సీరియల్ లో భాగంగా వచ్చేవారం హైలెట్స్ ఏంటో తెలుసుకుందాం…హిమ మనసులో తాను ఉన్నప్పటికీ కావాలనే తనని రిజెక్ట్ చేసిందని నిరుపమ్ బాధపడుతూ ఉంటారు. అయితే సౌర్య మనసులో డాక్టర్ సాబ్ ఉన్నారని తెలుసుకున్న హిమ ఎలాగైనా వారిద్దరిని కలపాలని కంకణం కట్టుకుంది.
హిమ వద్దని చెప్పడంతో స్వప్న తన కొడుకు మరో పెళ్లి చేయాలని శోభను రంగంలోకి దింపుతుంది. శోభ డాక్టర్ సాబ్ తో చనువుగా ఉండడం కోసం ప్రయత్నించగా నిరుపమ్ జ్వాలతో చాలా చనువుగా ఉంటారు.అయితే హిమలో దాగి ఉన్న ప్రేమను బయట పెట్టడం కోసం అలా నటిస్తుండగా సౌర్య మాత్రం డాక్టర్ సాబ్ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడని సంబరపడుతోంది. ఇక తన ప్రేమకు జ్వాల అడ్డుగా ఉందని ఎలాగైనా తనని తప్పించాలని శోభ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇకపోతే ఒక ఫంక్షన్ పేరుతో తనని అవమానించాలని శోభ ఎత్తులు వేస్తోంది. ఈ కార్యక్రమానికి జ్వాలను కావాలనే పదేపదే రావాలని వేడుకుంటుంది.

జ్వాల నేను ఎందుకు రావాలి అంటూ శోభతో మాట్లాడగా నీ ఇష్టం మీ తింగరి డాక్టర్ సాబ్ కూడా వస్తున్నారు అంటూ తనని ఫంక్షన్ కి వచ్చేలా చేస్తుంది. ఇకపోతే ఈ సీరియల్లో తాజాగా వంటలక్క సీరియల్ కి సంబంధించిన నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. మురళి వరలక్ష్మి ఈ సీరియల్ లో సందడి చేశారు. ఈ విధంగా ఈ సీరియల్ లో కి వంటలక్క రావడంతో కొందరు ఈ సీరియల్ గురించి ఎన్నో ఊహాగానాలు చేస్తున్నారు. ఇలా వంటలక్కను ఈ సీరియల్ లోకి తీసుకు రావడానికి కారణం మరికొన్ని ఎపిసోడ్ లలో ఈ కార్యక్రమానికి తిరిగి దీపా రీఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
దీపా కార్తీక్ చనిపోలేదని వారు బ్రతికే ఉన్నారు అంటూ, తిరిగి త్వరలోనే ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇప్పించడం కోసమే ఇలా వంటలక్క పాత్రలను చూపించారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే తిరిగి దీపా కార్తీక్ ఈ సీరియల్లో కి రీ ఎంట్రీ ఇస్తే ఇక ఈ సీరియల్ రేటింగ్ ఆకాశాన్ని తాకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సీరియల్ ప్రతి వారం టాప్ రేటింగ్ సొంతం చేసుకొని నెంబర్ వన్ సీరియల్ గా బుల్లితెరపై ప్రసారమవుతోందని చెప్పాలి.