Karthika Deepam june 3 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా,నిరుపమ్ కోసం అనాధ ఆశ్రమం కి వెళుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్, జ్వాలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో స్వప్న,నిరుపమ్ కి ఫోన్ చేసి కోప్పడుతూ ఆటో వాళ్ళ తిరగడం ఏంటి నష్టపోతారు అని అనగా.. అప్పుడు నిరుపమ్ నాకు నచ్చింది చేస్తాను అంటూ సీరియస్ గా చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది.
Karthika Deepam june 3 Today Episode
మరొకవైపు శోభ ద్వారా పిన్ని బాబాయిల గురించి తెలుసుకునే పనిలో పడుతుంది. జ్వాలా పిన్ని బాబాయ్ లు దొంగలు అని తెలుసుకున్న శోభా ఎలా అయినా నీ అంతు చూస్తాను అని మనసులో అనుకుంటుంది. మరోవైపు హిమను సౌందర్యను తిడుతుంది.
ఎందుకు వద్దన్నావే.. మీ అమ్మ నాన్నలకు మనశాంతి లేకుండా చేస్తున్నావ్ అని తిడుతు ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ హిమ ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన సెల్ఫీ వీడియో హిమకు పంపిస్తాడు.కానీ హిమ ఆ వీడియో చూడకుండా సౌందర్య, ఆనంద్ రావులతో గొడవ పడుతూ కోపంతో ఫోన్ ను పగలగొడుతుంది.
కానీ మరొకవైపు ప్రేమ్ రిప్లై కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తరువాత జ్వాలా, నిరుపమ్ ఆటోలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉండగా,నిరుపమ్ మాత్రం ఏదో పరధ్యానం తో ఉంటాడు. జ్వాలా ఎంత అడిగిన సమయం వచ్చినప్పుడు చెప్తాను అనగా జ్వాలా మాట్లాడుతూనే నిరుపమ్ ను కూల్ చేస్తుంది.
మరొకవైపు ప్రేమ్,హిమ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత శోభ ఒక పార్టీ ఏర్పాటు చేశాను నువ్వు నిరుపమ్, జ్వాలా ముగ్గురు రావాలి అని హిమకు ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు హిమ జ్వాలా, బావని కలపడానికే పార్టీ కి వెళదాం అనుకుంటుంది. ఇక వారిద్దరినీ ఒకటి చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని హిమ తన మనసులో అనుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam May 30 Today Episode : హిమపై మండిపడ్డ సౌందర్య.. హిమ పెళ్లి ఆపేస్తాను అంటున్న నిరుపమ్..?