Intinti Gruhalakshmi june 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని పార్టీకి ఎందుకు వచ్చావు అంటూ అంకిత వాళ్ళ అమ్మ అవమానిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నందు తన ఫ్రెండ్స్ కి తన పెద్ద కొడుకు అభి డాక్టర్ అంటూ పరిచయం చేస్తాడు. నా పెద్ద కొడుకుకి పెద్దలంటే గౌరవం అని గొప్పగా చెప్పగా వెంటనే అభి తమ్ముడిని పరిచయం చెయ్యి డాడ్ అనడంతో వాడు నా రెండో కొడుకు ఎందుకు పుట్టాడో ఏం చేస్తున్నాడో తెలియదు అంటూ ప్రేమ్ ని అవమాన పరుస్తాడు నందు.
Intinti Gruhalakshmi june 2 Today Episode
ఆ మాటలు విన్న ప్రేమ్ చాలా బాధ పడతాడు. నందు మాటలకు అభి కూడా బాధపడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అదంతా చూసిన శృతి వెళ్లి ప్రేమ్ కు ధైర్యం చెబుతుంది. మరొకవైపు అంకిత ఏ చీర కట్టుకొని వస్తుంది అని లాస్య దివ్య లు బాగా ఎదురు చూస్తూ ఉండగా గాయత్రీ తన చీర కట్టెలా చేస్తుంది అని లాస్య పొంగిపోతూ ఉంటుంది.
అప్పుడు నందు అంకిత ఖచ్చితంగా తులసి తెచ్చిన చీర కట్టుకుంటుంది అని అనడంతో లాస్య నందు పై ఫైర్ అవుతుంది. అలా వారు ఒకరికొకరు అంకిత ఏ చీర కట్టుకొని వస్తుందో అని అనుకుంటూ ఉండగా తులసి ఈ చీర కట్టుకున్న పరవాలేదు అని అంటుంది. ఇక మొత్తానికి అంకిత తులసి తెచ్చిన చీర కట్టుకోవడం తో లాస్య ఫీల్ అవుతుంది.
తులసి వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు. అప్పుడు లాస్య కోపంతో గాయత్రి ని పిలిచి ఎలా అయినా నేను తెచ్చిన చీర కట్టుకునేలా చేయి అని చెప్పి జ్యూస్ తీసుకుని వెళ్లి అంకితకు బలవంతంగా తాగిస్తూ చీర పై జ్యూస్ ని పడేలా చేస్తుంది. దాంతో అంకిత చీర పాడయినందుకు చాలా బాధపడుతుంది.
అప్పుడు నేను ఈ కేక్ కట్ చేయను అని అనగా అప్పుడు గాయత్రి అందరికోసం కేక్ కట్ అమ్మ అని చెప్పి లాస్య తెచ్చిన చీర కట్టుకో అని అనడంతో అంకిత ఆ చీర మార్చుకోవడానికి బాధపడుతుంది. అప్పుడు తులసి చీర మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని నేను ఈ చీరలు ప్రత్యేకత తయారుచేశాను చీర పై మరకలు పడిన కూడా తుడిస్తే పోతుంది అని చెప్పి చేస్తుంది.
ఆ తరువాత అంకిత కేక్ కట్ చేసి లాస్యకు పెట్టకుండా తులసికి పెట్టడంతో లాస్య అవమానంగా ఫీల్ అవుతుంది. అప్పుడు తులసి అంకిత కోసం ఒక పాట కూడా పడుతుంది. మరొకవైపు గాయత్రి మీ మమ్మీ దొంగ మార్గం ద్వారా ఇలా వచ్చింది ఎలా అయినా ఆస్తిని కాజేయాలని చూస్తోంది అని అనడంతో ఆ మాటలు విన్న తులసి మా అమ్మ అలా కాదు అని ఒక్క మాట చెప్పురా అభి అని తన మనసులో బాధ పడుతుంది. ఆ తర్వాత తులసి అంకిత దగ్గరికి వెళ్లి ఇకపై మాతో కలవద్దు మా ఇంటికి రావద్దు అని చెప్పడంతో అంకిత కుమిలిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Kasthuri comments on kl rahul: కేఎల్ రాహుల్ అండర్ వేర్ పై కస్తూరి కామెంట్లు.. ఇదేందమ్మా ఇది!