...

Horoscope: ఈరెండు రాశుల వాళ్ల ఇంటికి ఈరోజు లక్ష్మీ దేవి రావడం ఖాయం..!

Horoscope: ఈరోజు అనగా ఆగస్టు 7వ తేదీ ఆదివారం రోజు పన్నెండు రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయనే విశయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్ల ఇంటికి లక్ష్మీ దేవి రావడం ఖాయం అని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి.. మకర రాశి వాళ్లు స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజనం సౌఖ్యం కూడా కలదు. మనఃసౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. గాయంత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మంచి జరుగుతుంది.

కుంభరాశి.. తలపెట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. కచ్చితంగా ఈరోజు మీ ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది. కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇక నుంచి మీకు లాభాలే లాభాలు కల్గుతాయి. అంతే కాదండోయ్ విందు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దేవతా ఆరాధన చాలా మంచిది.