Viral Video : రోడ్డుపై వెళ్తున్నప్పుడు దాహం వేయగానే మన చూపు వెళ్లేది.. అక్కడ ఏమైనా నీటిపంపు ఉందా అనే. ఎక్కడో ఓ చోట ఏదో ఒక సందర్భంలో మనం నీటి పంపు నీళ్లను తాగే ఉంటాం. అయితే మనం దాహం వేసి నీటి పంపు వద్దకు వెళ్లినప్పుడు అందులోంచి నీటికి బదులుగా నిప్పులు వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఊహించుకోవడానికే కష్టం. అయినా నీళ్లకు బదులు నిప్పెలా వస్తుందని అనిపిస్తుంది కదా.. అయితే మనం ఇప్పుడు చూడబోయే పంపులోంచి నీళ్లకు బదులుగా నిప్పే వచ్చింది. అయితే ఎలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లోని బక్స్ హహా కాచర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ వింత ఘటన జరిగింది. గ్రామంలోని చేతి పంపు నుంచి నీరు, మంటలు ఒకేసారి వచ్చాయి. ఇది చూసిన గ్రామస్థులు తీవ్రంగా భయపడిపోారు. ఈ వింతను చూసేందుకు కేవలం గ్రామస్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చారు. అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.
ఈ వింతను చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఛతర్ పూర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాచర్ గ్రామంలో కొందరు వ్యక్తులు వాకింగ్ కు వెళ్లినప్పుడు చేతి పంపు నుంచి మంటలు రావడం చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వీరు వెల్లి గ్రామస్థులకు విషయం చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
Read Also : Elephant says thank : తనను కాపాడిన జేసీబీకి తన స్టైల్ లో థాంక్స్ చెప్పిన జేసీబీ!