Elephant says thank : మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరైనా సాయం చేస్తే చాలా సంబరపడిపోతాం. అంతేనా సాయ చేసిన వారికి గుర్తు లేకపోయినా మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అది మానవ నైజం. కేవల మనుషులే కాదండోయ్ పశువులు, జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఆకలి బాధ నుంచి ప్రాణ భయం వరకు, ప్రేమ, కరుణ, జాలి, దయ, కోపం వంటి అన్ని ఫీలింగ్స్ ను బయటకు చూపిస్తాయి.
అయితే వాటికి మనం సాయం చేస్తే మన వెంటే తిరుగుతాయి. కుక్కలకు బుక్కెడు బువ్వ పెడితే.. మనపై కృతజ్ఞతతో రోజంతా మన ఇంటికి కాపలాగా ఉంటుంది. ఏనుగు కూడా తన కృతజ్ఞతా భావాన్ని చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇందులో ఓ ఏనుగు గుంతలో పడిపోయింది. గుంతలో నుంచి బయటకు వచ్చేందుకు చాలానే శ్రమించింది. కనానీ పైకి మాత్రం రాలేకపోయింది.
A village in India Rescue Elephant Using Excavator…. And It Wave Back to Thanks pic.twitter.com/B5Wc1LCsq4
Advertisement— Gabriele Corno (@Gabriele_Corno) August 25, 2022
Advertisement
స్థానికులు ఏనుగు ఇబ్బందిని గమనించి పక్కనే ఉన్న జేసీబీతో దానికి సాయం అందించారు. ముందుగా జేసీబీ డ్రైవర్ ఏనుగు తొండం భాగంల సపోర్టుగా జేసీబీ లోడర్ బకెట్ ను ఉంచుతాడు. అయినా ఏనుగుకు పట్టు దొరక్క పోవడంతో గుంత నుంచి పైకి రాలేకపోయింది. దీంతో జేసీబీ లోడర్ బకెట్ ను ఏనుగు నడుం భాగంలో సపోర్డుగా ఉంచుతాడు. దీంతో ఆ ఏనుగు పైకెక్కుతుంది.
Read Also : Viral Video: నీళ్లకు బదులుగా నీటి పంపులోంచి నిప్పు వస్తోంది.. ఎక్కడో తెలుసా?