Ennenno Janmala Bandham serial Oct 6 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆదిత్య, వేద మా నాన్నని విడిచిపెట్టు అన్న మాటలను సులోచన తో చెప్పి బాధపడుతుంది వేద.. ఆ మాటలు విన్న సులోచన ఆవేశంతో మాళవిక ఇంటికి వెళుతుంది. నా కూతురు జోలికి రావద్దు.. నీది ఒక బతుకేనా ఓ తల్లి వేనా అసలు ఆడదానివేనా అంటూ కోపంతో తిడుతుంది. ఇంకొకసారి నా కూతురు జీవితం జోలికొస్తే ఊరుకోను అంటూ మాళవిక కు అభిమానికి వార్నింగ్ ఇస్తుంది. అక్కడే ఉన్న కైలాసం తిడుతుంది.
సులోచన కోపాన్ని చూసి మాళవిక అభి కైలాస్ తట్టుకోలేక పోతారు. ఆవేశంలో ఇంటికి బయలుదేరిన సులోచన వేద మాటలు గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను ఇచ్చిన వార్నింగ్ కు మాలవిక, వేద జోలికి రాదు.. ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొడుతుంది. ఆ కారు ఎవరిదో తెలీదు. ఈ యాక్సిడెంట్ లో మాళవిక, అభి మాన్యం, కైలాస్ కుట్ర ఉందేమో తెలియాలి మరి.. సులోచన వెనకకు పడిపోతుంది తలకు బలమైన గాయం పడి పోతుంది. జనమంతా చుట్టూ చేరుతారు. అటువైపు వెళుతున్న యశోధర కారు దిగి ఎవరా అని చూస్తే సులోచన. వెంటనే ఆస్పత్రికి తీసుకుని ఉంటాడు.
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అక్టోబర్ 6 ఈరోజు ఎపిసోడ్ : మాలవిక, అభికి సులోచన వార్నింగ్..
వేద కి ఫోన్ చేసి అత్తయ్యకు యాక్సిడెంట్ అయింది కంగారు పడకు యశోద చెబుతాడు. వేద అక్కడికి వచ్చి తల్లి కోసం ఏడుస్తుంది. ఐసీయూలో వేద తల్లిని చూస్తూ తల్లడిల్లి పోతుంది.. అమ్మకు ఏమీ కాదని ధైర్యం చెప్పాడు యశోధర. ప్రేమగా చేతులు పట్టుకుని ఓదారుస్తాడు. వేద అక్క బావ, వసంత్ , చిత్ర హాస్పిటల్ కి వస్తారు. వేద నువ్వే అందరికీ ధైర్యం చెప్పాలని యశోధర అంటాడు. వేద ఇప్పుడు నేను డాక్టర్ ని కాదు ఒక కూతుర్ని అంటూ ఏడుస్తుంది. ఏమి చేయాలి నాన్నకి ఏం చెప్పాలి నాన్న ని ఎలా ఓదార్చాలి అంటూ బాధపడుతుంది. వేద వాళ్ళ నాన్న హాస్పటల్ కి వస్తాడు.
వేద ఎందుకు ఏడుస్తున్నావ్ ఏమైంది.. సులోచన కి యాక్సిడెంట్ అయింది అని చెప్తారు. మాలిని వేదాన్ని ఓదారుస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేశాం తలకు బలమైన గాయం తగలడం వల్ల.. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అనడంతో అల్లాడి పోతారు అంతా. సులోచన కుటుంబం.. మాలిని కుటుంబం ఏడుస్తూ ఉంటారు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో మాలిని ఏడుస్తూ సులోచన ఉన్న ఐసి గదిలోకి వెళ్ళిపోయి.. ఇదిగో సులోచన నేను వచ్చినా సరే నువ్వు లేవా నాకు భరతనాట్యం రాదు అన్నావు కదా నీ కోసం ఏం చేస్తున్నాను చూడు ఏడుస్తూ నాట్యం చేస్తుంది. చాలా ఎమోషనల్ అవుతుంది. సరిగ్గా అప్పుడే సులోచన వేలు కదలడంతో అంతా చాలా సంతోషిస్తారు చూడాలి మరి..
Read Also :Ennenno Janmala Bandham Serial : అభికి షాకిచ్చిన మాలవిక.. యశ్‌కు దగ్గరయ్యేందుకు ప్లాన్..!