Devatha: తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవికీ జ్వరం రావడంతో రాధా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రాధ, దేవి వైపు చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నేను మీ నాయన గురించి చెబితే నువ్వు మరింత కష్టాలు పడతావు అందుకే నేను మీ నాన్న గురించి నీకు చెప్పలేదు అని అంటుంది. కానీ నేను నిన్ను ఇలా చూసి తట్టుకోలేను ఎలా అయినా నీకు నిజం చెప్పేస్తాను అని రాధ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు మాధవ, మల్లికార్జున కి ఫోన్ చేయగా అతని లిఫ్ట్ చేయకపోయేసరికి చిరాకుపడుతూ కోప్పడుతూ ఉంటాడు.
ఆ తర్వాత మల్లికార్జున ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను ఈ విషయాన్ని వెంటనే మాధవ్ సార్ కి చెప్పాలి అని తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్మయి రాధ దగ్గరికి వెళ్లి దేవికి ఏమయ్యింది అమ్మ అంటూ బాధగా అడుగుతుంది. అప్పుడు ఏం కాలేదు అని ధైర్యం చెబుతుంది రాధ. మరొకవైపు ఆదిత్య జరిగిన విషయం తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు నిజం చెబితే దేవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది కాబట్టి కొద్ది రోజులు చెప్పకుండా ఉంటేనే మేలు అని అనుకుంటాడు ఆదిత్య.
ఆ తర్వాత మాధవ ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవి వచ్చి నాకెందుకు అబద్ధం చెప్పావు మా నాయన అనుకుని ఎంతో బాధపడ్డాను అని అంటుంది దేవి. అప్పుడు మాధవ ఏమీ తెలియనట్టుగా అతను మీ ఫోటో చూపించబోయే సరికి నేను కూడా మీ నాన్ననే అనుకోని మోసపోయాను అంటూ దేవిని నమ్మించి ప్రయత్నం చేస్తాడు.
అప్పుడు మా అసలైన ఎవరు చెప్పు అని మాధవల్ని నిలదీస్తూ ఉండగా అక్కడికి రాద వచ్చి నేను చెబుతాను అని అంటుంది. అప్పుడు దేవి నువ్వు ఇలాగే అంటావు కానీ చెప్పవు అనడంతో వెంటనే నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను బిడ్డ నీకు నిజమే చెప్పేస్తాను అని అంటుంది. రాధ మాటలకు మాధవ ఒకసారిగా షాక్ అవుతాడు.
ఆ తర్వాత దేవుడమ్మ ఆదిత్యతో అమెరికా ప్రయాణం గురించి మాట్లాడగా ఆదిత్య ఫైర్ అవడంతో వెంటనే దేవుడమ్మ ఆదిత్య పై కోప్పడుతుంది. ఇప్పుడు నువ్వు అమెరికాకు వెళ్లకపోతే నా నిర్ణయం మరొక విధంగా ఉంటుంది ఆదిత్య అని అంటుంది. ఆ తర్వాత మాధవ రాధా తో ఎప్పటిలాగే మాట్లాడుతూ ఉంటాడు. రాధ కూడా ఏ మాత్రం తగ్గకుండా మాధవకు తగిన విధంగా బుద్ధి చెప్పేలా మాట్లాడుతుంది.