Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి క్లాస్ కి వచ్చినా కూడా వసుధార పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో రిషి బోర్డు మీద ఒక ప్రాబ్లం ఇచ్చి వసు ని చేయమని అనగా అక్కడికి వసుధార వెళ్లి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా బంగారం గురించి లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి ఏం చేస్తున్నావ్ వసుధార అని గట్టిగా అరవడంతో వెళ్లి మౌనంగా కూర్చుంటుంది వసు. మరొకవైపు జగతి మహేంద్ర కారులో జరిగిన విషయం గురించి సంతోష పడుతూ ఉండగా ఇంతలో కోసం అక్కడికి వస్తాడు.
ఆ తర్వాత వారి ముగ్గురూ ఫన్నీగా రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వసుధార వెళుతుండడంతో అది చూసిన గౌతమ్ వసు ని పిలుస్తాడు. అప్పుడు వసుధార పలకకపోయేసరికి గౌతమ్, వసు దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జగతి,మహేంద్ర ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసిన రిషి మీటింగ్ లో ఎగ్జామ్స్ గురించి అందరికీ సూచనలు చెబుతాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయాక జగతిని అక్కడే ఉండమని చెప్పి వసు గురించి జగతికి కంప్లైంట్ ఇస్తాడు రిషి. అప్పుడు జగతి సార్ అని పిలవడంతో మీకు ముందే చెప్పాను కదా మేడం సార్ అని పిలవద్దండి అని అనడంతో జగతి మళ్ళీ సంతోషపడుతుంది.
వసుధార ఏవేవో లెక్కలు వేస్తుంది గ్రామ్ అంటుంది తాను ఏ పరీక్షలపై శ్రద్ధ పెట్టమని చెప్పండి అనడంతో జగతి సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి వసుధార కి ఏమైంది ఒకసారి కాఫీ షాప్ కి వెళ్దాం అని వసు పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. ఆ తర్వాత జగతి మహేంద్రా గౌతమ్ ముగ్గురు రిషి వాళ్ల గురించి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సాక్షి దేవయాని ఒకచోట కలుసుకొని జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దేవయాని రిషి నీవాడు అంటూ మళ్ళీ సాక్షిని రెచ్చగొడుతుంది.
అప్పుడు దేవయాని మాటలకు సాక్షి నవ్వడంతో అలా నవ్వుకు సాక్షి చేసి చూపిస్తాను అని శబదం చేస్తుంది దేవయాని. ఆ తర్వాత పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు రిషి. అప్పుడు ఆ రెస్టారెంట్ మేనేజర్ వసుధార రాలేదు అందులోనూ పదివేల రూపాయలు ముందే అడిగింది అని చెప్పడంతో వసుధారకు అంత డబ్బులు ఎందుకు అవసరం అని ఆలోచిస్తూ వసు రూమ్ కి బయలుదేరుతాడు. మరొకవైపు వసుధార రిషి తెచ్చిన ఎంగేజ్మెంట్ రింగును మెడలో వేసుకుంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి రావడంతో రిషి ని చూసి షాక్ అవుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World