Brother – Sister Love : అన్నాచెల్లెల్ల మధ్య అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ప్రేమ సందర్భానుసారం బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడూ కొట్టుకుంటున్నా వారి మధ్య బలమైన బంధం ఉంటుంది. ఇంకెవరైనా చిన్న మాట అన్నా మిగతా వాళ్లు అస్సలే ఊరుకోరు. అలాంటి సమయంలోనే నిజమైన ప్రేమ అంటే ఏమిటో మిగతా వారికి తెలిసి వస్తుంది. అలా జరిగిన ఓ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.

ఇద్దరు చిన్న పిల్లలు బాస్కెట్ బాల్ తో ఆడుకుంటున్నారు. చెల్లెలు బంతితో ఆడుకుంటుండగా అక్కడికి వచ్చిన అన్న తన చేతిలోని బంతిని తీసుకుని బాస్కెట్ బాల్ గోల్ వేస్తాడు. అయితే తన చేతిలో బంతిని తీసుకున్నందుకు ఆ పాప ఏడుస్తుంది. గోల్ వేసిన తర్వాత ఆ బాస్కెట్ బాల్ ను తిరిగి ఆమె చేతికి అందించినా తను మాత్రం ఏడుపు ఆపదు. తర్వాత తను కూడా గోల్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గోల్ వేయలేక పోతుంది.దీంతో ఆ పాపాయి మళ్లీ ఏడుపు లంకించుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి తన చెల్లెలిని ఎత్తుకుని గోల్ వేయిస్తాడు. తర్వాత ఆ పాప నవ్వుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అన్నాచెల్లెల్ల ప్రేమ అంటే ఇలా ఉండాలంటూ పలువురు నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
Big Bros 💙 pic.twitter.com/dIwIDWVnUn
— CCTV_IDIOTS (@cctv_idiots) July 20, 2022
Advertisement
Read Also : Viral Video : చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!