Youtuber gangavva : సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మై విలేజ్ షో. తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన గంగవ్వ అదే క్రేజ్ తో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. హౌజ్ లో తనదైన తీరు, మాటలతో ఆకట్టుకున్న ఆమె అనారోగ్య కారణాలతో ఐదో వారంలోనే బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ఇఖ బయటకు వచ్చాక గంగవ్వ పలు చిత్రాల్లో నటించే ఆఫర్ అందుకుంది. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కూడా నటించింది.
ఓ వైపు వెండితెరపై అలరిస్తూనే మరో వైపు తన యూట్యూబ్ చాల్లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. దీంతో ఆరా తీయగా.. యూట్యూబ్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ చానల్ ద్వారా అన్ని ఖర్చులు పోను నెలకు రక్ష రూపాయల వరకు గంగవ్వకు ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఒక రోజు షూటింగ్ కు 10 వేల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని వినికిడి.
Read Also : Shanmukh jaswanth: ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొన్న షణ్ముఖ్ జస్వంత్, ధర ఎంతంటే?