Big boss 6: కుర్రాడు బాబోయ్ సాంగ్ కు ఆదిరెడ్డి అదిరిపోయే స్టెప్పులు..!

Big boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఆటలు, పాటలు కామన్.. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లతో చిన్న చిన్న గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్తాడు. ఈ ఆదివారం కూడా హౌస్ మేట్స ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. కంటెస్టెంట్లతో సుత్తి దెబ్బ గేమ్ ఆడించాడు నాగ్. ఒక్కొక్కరు లేచి నాగ్ అడిగే ప్రశ్నకు సూట్ అయ్యే వ్కక్తిపై సుత్తితో కొట్టాలి. ఈ గేమ్ చాలా ఫన్నగా సాగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరని అడగ్గా.. ఆరోహి పేరు చెబుతూ ఆమె తలపై సుత్తితో కొట్టింది. ఇక నోటిదూల ఎవరికి ఎక్కువ అని అడగ్గా.. ఆదిరడ్డి వెళ్లి గీతూ తలపై కొట్టాడు. ఈ విషయాన్ని ఆడియో కూడా ఇనామస్ గా ఒప్పుకున్నారు.

ఇక హౌస్ లో తిండిబోతు రోహిత్ అని సుదీప చెప్తే.. ఆడియన్స్ మాత్రం శ్రీ సత్యకు ఓటేశారు.
ఇక ఈ గేమ్ చివర్లలో కంటెస్టెంట్స్ అంతా కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు డీజే సాంగ్ కు స్టెప్పులేసి అలరించాడు. నాగార్జున మాత్రం ఆదిరెడ్డిని ప్రత్యేకంగా మరోసారి ఆ పాటకు డ్యాన్స్ చేయమని అడగడంతో ఆయన… తనకు వచ్చిన స్టెప్పులతో మ్యానేజ్ చేశాడు. ఆదిరెడ్డి స్టెప్పులు చూసి నాగార్జున పగలబడి నవ్వాడు. ఇఖ హౌస్ నరుంచి ఎవరు బయటకు వెళ్తారనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నేహా ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.