Neha Chowdary: బిగ్ బాస్ షో ఆదివారం ఎపిసోడ్ రానే వచ్చేసింది. నీ దూకుడు అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. సుత్తి దెబ్బ అంటూ కంటెస్టెంట్స్ తో ఓ టాస్క్ కు ఇచ్చిన షో మొదలు పెట్టారు. నోటి దూల ఎవరికి అని ఆదిరెడ్డిని అడగ్గా.. అతను గలాటా గీతూ తలపై కొట్టాడు. అందుకు ఆడియన్స్ కూడా ఎస్ అని చెప్పారు. ఇంట్లో బ్రెయిన్ లెస్ పర్సన్ ఎవరు అనగా రోహిత్-మెరీనా జంట రాజ్ ను సెలెక్ట్ చేశారు. అయితే ఎక్కువ మంది ఆడియన్స్ వాళ్ల నిర్ణయానికి నో చెప్పారు. హౌస్ లో పని దొంగ ఎవరనగా… రేవంత్ తలపై సుత్తితో కొట్టాడు. కానీ ఆడియన్స్ మాత్రం అతను కాదన్నారు. ఓవర్ డ్రమటిక్ ఎవరనగా నేహా పేరు చెప్పారు.
ఆ తర్వాత నామినేషన్లలో ఉన్న కొందరిని సేవ్ చేయగా… నేహా, వాసంతి మిగిలిపోయారు. స్టేజీపై ఓ తులాభారం ఏర్పాటు చేసి ఇద్దరి ఫొటోలను పెట్టారు. నేహాకు వెయిట్ తక్కువ రావండోత ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత స్టేజీపైకి పిలిచి.. దమ్మున్న వాళ్లెవరు, దుమ్మెవరు అని అడగ్గా… అయితే ఇనయ, రేవంత్, ఆరోహి, గతూ, వాసంతిలను దుమ్ముగా సెలెక్ట్ చేసింది. రేవంత్ వల్లే తాను ఓడిపోయానని చెప్పింది. చంటి, శ్రీసత్య, రాజ్, సుదీప, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డిలను దమ్మున్న వాళ్లుగా సెలెక్ట్ చేసింది.