Devatha serial Oct 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగ్యమ్మ, మాధవకు ఫుల్ గా వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో నా కళ్ళు కాదు నీ కళ్ళు నెత్తికెక్కినాయి అందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని అంటుంది భాగ్యమ్మ. అప్పుడు మాధవ ఏంటి నోరు లేస్తుంది అని అనడంతో వెంటనే భాగ్యమ్మ నువ్వు చేసే పనులకు నోరు కాదు చెయ్యి లేస్తుంది అంటూ చేయి చూపించడంతో మాధవ షాక్ అవుతాడు.

రాధ ఎవరో కాదు నా బిడ్డ..నా బిడ్డను కష్టపెడితే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అంటుంది భాగ్యమ్మ. పరాయి వాడి పెళ్ళాం మీద ఆశ పెట్టుకుంటున్నావే మధ్యలో పిల్లల్ని అడ్డుపెట్టుకుంటున్నావు నువ్వు మనిషివేనా అని అంటుంది భాగ్యమ్మ. నా బిడ్డకు ఎవరు లేరు అనుకున్నావేమో కన్నదాని నేను ఉన్నాను నా బిడ్డ జోలికి వస్తే జొన్న కంకులు కోసినట్టు పీక కోసేస్తా అని అన్నాడంతో వెంటనే మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
మరొకవైపు ఆదిత్య దేవి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్లి దేవి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే రామ్మూర్తి,దేవి,చిన్మయి వాళ్ళు అక్కడికి రావడంతో రామ్మూర్తి తో జానకి హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య. తర్వాత దేవి ఆదిత్యతో మాట్లాడకుండా లోపలికి వెళుతూ ఉండగా ఏమయింది దేవి అని అడగడంతో దేవి మౌనంగా ఉంటుంది.
కానీ దేవి మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రాధ, జానకి కీ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు జానకి,రాధ పరిస్థితి చూసి ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు రాధా ఏం కాదు అని ధైర్యం చెబుతూ ఉండగా పక్కనే ఉన్న మాధవ వారి మాటలు వింటూ ఉంటాడు.
దేవత సీరియల్ అక్టోబర్ 12 ఈరోజు ఎపిసోడ్ : ఆదిత్య,రాధ లపై కోపంతో రగిలిపోతున్న సత్య..?
ఆ తర్వాత మాధవ అక్కడ నుంచి వెళ్లి రాధ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. మరొకవైపు ఆదిత్య అన్నమాట తలుచుకుని సత్య బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత జానకి ఒకచోట కూర్చుని ఉండగా ఇంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు మాధవ జానకి కాళ్లు పట్టుకొని నువ్వు కింద పడిపోయి నాకు చాలా మంచి చేశావు అని థాంక్స్ చెబుతూ ఉంటాడు.
ఇక మాధవ మాటలు వింటున్న భాగ్యమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొక వైపు ఆదిత్య, రాధ ఒక చోట కలిసి దేవి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాధ ఏమి జరుగుతోంది నాకు అర్థం కాలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సత్య వస్తుంది. అది చూసి ఆదిత్య రాధ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు సత్య అక్కడికి కోపంతో రగిలి పోతూ వస్తుంది. అప్పుడు సత్య వారిని అపార్థం చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది.
Read Also : Devatha: మాధవ నిజ స్వరూపం తెలుసుకున్న భాగ్యమ్మ.. ఆదిత్య,రాధ లపై కోపంతో రగిలిపోతున్న సత్య..?