Baby dainosaurs in beach: ఒకప్పుడు డైనోసర్లు ఉండేవని చెప్పుకోవడమే తప్ప చూసింది లేదు. అంటే నేరుగా. టీవీలో, సినిమాల్లో అలా మనం డైనోసర్లను చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా బీచ్ డైనోసర్ల సమూహం పరిగెత్తడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 14 సెకన్ల నిడివి గల ఈ వీడియో ట్విట్టర్ వినియోగదారులను అమోమయానికి గురి చేసింది. ఎప్పుడో అవతరించిన డైనోసర్లు… మళ్లీ కనిపించడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. అయితే తీక్షణంగా పరిశీలించిన తర్వాత అవని డైనోసర్లు కావని ఒఖ స్పష్టతకు వచ్చారు.
డైనోసర్లను పోలి ఉన్న కోటిస్ అనే జీవులని గుర్తించారు. వీటిని కోటిముండిస్ అని కూడా పిలుస్తారు. ఇి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, మెక్సికో మరియు నైరుతి యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వీడియోకి ట్విట్టర్ లో 13.7 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 3 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. అయితే ఈ వీడియో ఏంటో మీరూ ఓ సారి చూసేయండి.
This took me a few seconds.. 😅 pic.twitter.com/dPpTAUeIZ8
— Buitengebieden (@buitengebieden) May 4, 2022