Baba Ramdev : బాలీవుడ్‌పై యోగా గురు సంచలన వ్యాఖ్యలు.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడన్న బాబా రామ్‌దేవ్..!

Baba Ramdev : ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటులు డ్రగ్స్ తీసుకుంటారని రామ్ దేవ్ బాబా ఆరోపించారు. సెలబ్రిటీల పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs
Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs

మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. షారుఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులోనే ఉన్నాడు.

Advertisement

Baba Ramdev : బాలీవుడ్ నటుల డ్రగ్స్ గుట్టువిప్పిన  యోగా గురు 

నటీమణుల విషయానికొస్తే.. వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసు’ నని అన్నారు. అంతేకాదు.. ‘సినిమా పరిశ్రమలో ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేస్తున్నారు. భారత్ ప్రతి మాదకద్రవ్య వ్యసనం నుంచి విముక్తి పొందాలని తీర్మానం చేయాలి. ఇందుకోసం మేం ఉద్యమం చేపడతామని రామ్ దేవ్ బాబా అన్నారు. బాబా రామ్‌దేవ్ గతంలో కూడా చాలాసార్లు బాలీవుడ్ నటులపై ఆరోపణలు గుప్పించారు.

Advertisement
Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs
Baba Ramdev Makes Sensational Comments On Salman Khan And Drugs

అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు చాలా మంది నటులపై ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్లీ వాళ్లనే ఆయన టార్గెట్ చేశాడు. ఆర్యవీరుడు, వీరాంగన సదస్సులో పాల్గొనేందుకు బాబా రామ్‌దేవ్ శనివారం మొరాదాబాద్‌కు వచ్చారు. డ్రగ్స్‌ గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్‌ని టార్గెట్ చేశాడు. పెద్ద సినిమా స్టార్లు డ్రగ్స్ తీసుకుంటారని, సినిమా ఇండస్ట్రీ మొత్తం దీని గుప్పిట్లో ఉందని బాబా రామ్‌దేవ్ అన్నారు. సల్మాన్ ఖాన్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు.

Advertisement

Read Also :  Rashmika Mandanna : ఆ స్టార్ హీరోతో ఆ పనికి ఒప్పుకున్న రష్మిక మందన.. డబ్బు కోసం మరి ఇలా తెగించాలా?

Advertisement
Advertisement