Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు. ముంబైలో ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నటించడానికి ముందుగా సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది.
ఆ అనుబంధం కారణంగానే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి సల్మాన్ ఖాన్ ముందుకు వచ్చారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో భాగంగా సల్మాన్ ఖాన్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇలా సల్మాన్ ఖాన్ లొకేషన్ లోకి అడుగు పెట్టాడో లేదో చిరంజీవికి ఒక కండిషన్ పెట్టారు. ఇంతకీ ఆ కండిషన్ ఏమిటి అనే విషయానికి వస్తే… మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న అభిమానం అతని ఫ్యామిలీతో ఉన్న చనువు కారణంగానే వారి కోసం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారనే విషయాన్ని వెల్లడించారు.
అయితే ఈ పాత్రలో నటించడం కోసం తాను పారితోషికం తీసుకొననే కండిషన్ పెట్టారు. ఈ విధంగా తన కండిషన్ కి ఒప్పుకోకుండా తనకు రెమ్యునరేషన్ ఇవ్వాలని చూస్తే తక్షణమే షూటింగ్ లోకేషన్ నుంచి వెళ్లిపోతానని మెగాస్టార్ చిరంజీవికి సల్మాన్ ఖాన్ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ ఉదార స్వభావం చూసి అక్కడ ఉన్నటువంటి చిత్రబృందం అలాగే నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఈయన సినిమాలలో నటించడానికి రెమ్యూనరేషన్ అడగాలే కానీ కోట్లలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఒక రూపాయి తీసుకోకుండా సినిమాలో గెస్ట్ రోల్ చేయడంతో సల్మాన్ ఖాన్ మంచి మనసు పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also : Ghani Trailer : గని ట్రైలర్ కిరాక్.. అదిరే డైలాగ్.. ఈ సోసైటీ.. గెలిచినవాడి మాటే నమ్ముతుంది..!