Intinti Gruhalakshmi serial Oct 22 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య నందులు తులసి వాళ్ల గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో నందు మాట్లాడుతూ నీకు సామ్రాట్ గారికి స్నేహం ఉంటే నీ వరకేచూసుకో కానీ ఇంతవరకు తేవద్దు ఇలాంటి విషయాలలోకి జ్యోక్యం చేసుకోవద్దు అని చెప్పు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ ఎక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా వెంటనే తులసి ఆపి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనగా మీ కోసమే అనడంతో మరి నేను చెప్పినప్పుడు వెళ్ళండి ఇది నా నా ఇల్లు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది తులసి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని అనగా వెంటనే లాస్య చూసారా ఇల్లు రాగానే దీనికి పొగరు వచ్చింది అనడంతో వెంటనే పరంధామయ్య తన మనసులో హమ్మయ్య ఇప్పుడు తులసి కొంచెం ధైర్యం వచ్చింది నేను ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంటాడు. అప్పుడు నందు ఈ ఇల్లు నీదే కావచ్చు కానీ ఇక్కడ ఉన్నవారు నా తల్లిదండ్రులు నా పిల్లలు అనటంతో వాళ్ళు నీకు మాత్రమే కాదు నాకు కూడా పిల్లలు అని అంటుంది తులసి.
ఎన్ని చేసినా మావయ్య గారు తులసికి అంగా ఉంటారు ఇక్కడ ఉన్న బయటికి గెంటేసి నాకెంటేస్తారు అని అంటుంది. అప్పుడు లాస్య వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా వెంటనే అనసూయ ఆపి ఇంట్లో నందుకి ఎంత అర్హత ఉందో నాకు తెలియదు కానీ గౌరవం ఉంది నా పెద్ద కొడుకుని ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని అంటుంది. కాదు కూడదు అంటే నేను కూడా వెళ్ళిపోతాను అంటుంది అనసూయ.
అప్పుడు తులసి నేను ఎవరిని ఇంటికి రావద్దు అని చెప్పలేదు అత్తయ్య కానీ నా జీవితంలోకి జ్యోక్యం చేసుకోవద్దు అని చెప్పాను ఇప్పటినుంచి సామ్రాట్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వస్తారు అని తెలియదు తులసి. ఇద్దరు ఒకే కారులో వెళ్తాం పక్కపక్కనే కూర్చుని వరంగల్ వరకు వెళ్తున్నాం రహస్యంగా కాదు అందరికి చెప్పే వెళ్తున్నాం ఎవరు వాపుతారు ఆపండి ఛాలెంజ్ చేస్తుంది.
మీరు ఎవరో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లో వాయిస్ రికార్డ్ ఓపెన్ చేసి పంపించండి తీరిక ఉన్నప్పుడు నేను చూసుకుంటాను అని అంటుంది తులసి. సామ్రాట్ గారు మా వాళ్ళు ఎవరైనా మీ మనసు బాధపెట్టి ఉంటే వాళ్ళ తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను రేపు కలుద్దాము అని తులసి అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. తర్వాలాస్య ఏంటి నందు ఇది తులసి ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడినా మావయ్య గారు ఏమీ అనరు కానీ మనల్ని మాత్రమే అంటారు అని అంటుంది.
Intinti Gruhalakshmi అక్టోబర్ 22 ఎపిసోడ్ : తులసి,సామ్రాట్ కలిసి వరంగల్..అనసూయ తులసి మీద వెటకారం..
ఆ తర్వాత అనసూయ ఆలోచిస్తూ మౌనంగా ఉంటుంది. అప్పుడు పనుంది మామయ్య నాతో మాట్లాడవా అనసూయ నేను ఇప్పుడు ఉంటే రేపు పొద్దున్నే కళ్ళు తెరుస్తాను లేదో భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే తర్వాత మాట్లాడాలి అనుకున్న ఉండరు అనటంతో అలా మాట్లాడకండి నేను నీ మీద కోపంగా లేను తులసి మీద కోపంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు వారిద్దరు తులసి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పరంధామయ్య అనసూయ కి ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించిన కూడా అనసూయ వినిపించుకోదు.
అప్పుడు అనసూయ అత్తు తులసిని ఆ సామ్రాట్ దగ్గర జాబ్ లో నుంచి మానేపిస్తేనే నేను మారతాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో తులసి, అంకితలు బట్టలు సర్దుకుంటూ, ఇల్లు మారిన తర్వాత బట్టలు సర్దుకోవడం అంటే పెద్ద పనే అని అనుకుంటారు. దానికి అంకిత, ఇదే సొంతిల్లు కదా ఆంటీ. ఆ తర్వాత తులసి అంకిత మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ ఫోన్ చేస్తాడు. ఆఫీస్ విషయం గురించి మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు.
మరుసటి రోజు నందు నేను వస్తున్నాను బయలుదేరుతున్నాను అనడంతో ఎక్కడికి వెళ్తున్నావ్ అని లాస్య అడగగా మా ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయట ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను అని అంటాడు. అయితే రేపు వెళ్ళు ఈరోజు పని ఉంది అని చెప్పినందును తీసుకొని వెళ్తుంది లాస్య. మరొకవైపు తులసి చీర కట్టుకొని రెడీ అవుతూ ఉండగా అనసూయ అది చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది.
అప్పుడు అనసూయ తులసి గురించి వెటకారంగా మాట్లాడుతూ ఉండగా పరంధామయ్య మరింత వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి లాస్య వాళ్ళు వస్తారు. అప్పుడు లాస్య తులసిని గురించి నోటికి వచ్చిన విధంగా బాగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రేమగా ఊరుకునే ఊళ్లంతా సరదాగా ఉంది కదా అలా బయటకు వెళ్లడానికి వచ్చాము అనడంతో వెంటనే అంకిత ఆంటీ లేనప్పుడు ఎలా వస్తామనుకున్నారు అని అంటుంది. నందు మీ ఆంటీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుంది కదా అమ్మ అని అంటాడు. కొత్త చీర కట్టినట్టు ఉన్నావు కదా తులసి అని అనగా ఎవరు ఎవరు కొన్నారు ఏంటి ఒకప్పుడు మా ఆయన కొన్నారులే ఇప్పటికీ సమయం దొరికింది కట్టుకోవడానికి అనడంతో లాస్య షాక్ అవుతుంది.