Intinti Gruhalakshmi Oct 21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో తులసీ పరంధామయ్యతో ఇప్పుడు ఇల్లు నాకెందుకు ఇవ్వాలనిపించింది మావయ్య అని అడగగా దేవుడికి గుడి కట్టడానికి కారణాలు కావాలా చెప్పు తులసి అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అత్తయ్య గారు కూడా మంచివారే నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది అని అంటుంది తులసి. ఇంతలోనే అక్కడికి అనసూయ వస్తుంది. ఏంటి మామ కోడలు ఏవేవో మాట్లాడుకుంటున్నారు మమ్మల్ని ఇక్కడ పడేశారు మా సామాన్లు ఎవరికి తెస్తారు.

అని అనగా వెంటనే పరంధామయ్య ప్రేమ అభి ఏజెన్సీ వాళ్లకు ఫోన్ చేసి మన సామాన్లు తీసుకుని రమ్మని చెప్పారు మీరు వెళ్లి ఆ పనులు చూడండి అని అంటాడు పరంధామయ్య. మరొకవైపు నందు లాస్యలు ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడికి భాగ్య వచ్చి మీరేమో డబ్బులు లేక ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అవతల తులసి అక్క గృహప్రవేశాలు చేస్తోంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భాగ్య అని అనగా మావయ్య గారు స్వయానా తులసి అక్కకి ఇండ్లు కొని రాసిచ్చారు.
అనడంతో వెంటనే లాస్య నమ్మే మాటలు చెప్పు భాగ్య మందులు కొనడానికి ఖాతా రాసుకునే మావయ్య ఇల్లు కొన్నారు అంటే ఎలా నమ్ముతాను అనడంతో భాగ్య ఫోటోలు వీడియోలు చూపిస్తుంది. అవి చూసి లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నందు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో మా నాన్న ఎవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్లకు ఇస్తారు మధ్యలో మనకేం హక్కు ఉంది అని అనగా. సామ్రాట్ చేసిన అవమానం కంటే ఇది పెద్ద అవమానం నందు.
సొంత కొడుకు కోడలు మనం ఉండగా ఆ తులసికి ఇవ్వడం ఏంటి? అడిగే వారు లేరు అనుకుంటున్నారా పదా నందు మనం వెళ్దాం అని అంటుంది లాస్య. నేను ఈ విషయంలోకి రాను నన్ను లాగకండి అని అనడంతో భాగ్య రండి వెళ్దాం బావగారు నేను లాస్య మాట్లాడతాను అని అంటుంది. నాకు తోడుగా ఉండండి చాలు అని నందుని రెచ్చగొట్టి అక్కడనుంచి తీసుకొని వెళ్తారు. మరొకవైపు తులసి ఇంట్లో పూజ చేసి హారతి ఇవ్వడానికి ఇంట్లో వాళ్ళని పిలుస్తూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ అక్కడికి వచ్చి హారతి తీసుకుంటాడు.
Intinti Gruhalakshmi అక్టోబర్ 21 ఎపిసోడ్ : తులసి మీద ఇష్టాన్ని సామ్రాట్ ఇలా..లాస్య, నందు ఆవేశం..
అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అనసూయ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు తులసి, నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అని అనగా, దీని అంతటికి మూలం సామ్రాట్ ఏ అమ్మ అని పరంధామయ్య అంటాడు. అప్పుడు ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని అడగగా కోర్టు దగ్గర నుంచి స్థలాన్ని సామ్రాట్ కొని నాకు అమ్మారు అమ్మా ఇదంతా సామ్రాట్ వల్లే జరిగింది అని అనడంతో ఇంతలోనే అక్కడికి నందు లాస్య వాళ్ళు వస్తారు.
బాగుంది సామ్రాట్ ఎంత మంచి దయా హృదయం, ఎంత మంచి జాలికలు మనసు, ఎదుటివారికి ఎన్ని సేవలు చేస్తున్నారు అని అంటూ, ఏంటి మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటున్నావా ఆ మర్యాదని నువ్వే తీసేసావు ఇంక నీకు మర్యాద ఇచ్చే అంత స్థాయి నీకు లేదు అని అనగా తులసి మధ్యలో అడ్డుకొని, నా అతిధి మీద కామెంట్ చేసే హక్కు నీకు లేదు లాస్య అని అంటుంది. అప్పుడు లాస్య భాగ్యలు తులసిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు పరంధామయ్య ఇన్నాళ్లు గుర్తుకురాని మేము ఈరోజు గుర్తొచ్చామంటే దానివరిక కారణం ఏంటో మాకు తెలుసులే అమ్మ అని అంటాడు. అప్పుడు లాస్య ఎందుకు మావయ్య ఈ పక్షవాతం అసలు కోడల్ని పట్టించుకోకుండా ఈ కోడలికి రాసిస్తున్నారు అని అనగా వెంటనే పరంధామయ్య నన్ను ఆపరేషన్ అప్పుడు వదిలేసి వెళ్లిపోయినప్పుడు ఈ ఇల్లు అమ్మి ఆపరేషన్ కి డబ్బులు చేర్చింది అయినా ఈ ఇంట్లో వాటాలు మీకు ఇచ్చాను కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనగా పాత ఇంటి వాటాల గురించి కాదు మామయ్య ఈ ఇంటి వాటాల గురించి అని అంటుంది భాగ్య.
ఆ తర్వాత మధ్యలో ప్రేమ్ కలుగు చేసుకోగా అభి పెద్దవాళ్ల గొడవలోకి మనకెందుకు లేరా అని అంటాడు. అనసూయ మౌనంగా ఉండడంతో మీరేం మాట్లాడరేంటి అత్తయ్య అని అనగా ఇంట్లో నా మాటకు ఎవరూ గౌరవించడం లేదు నా పెద్దరికంకి విలువ లేదు అని అంటుంది. అప్పుడు పరంధామయ్య నా ఇల్లు నా డబ్బులతో కొన్నాను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తాను.
అని మధ్యలో నందు పేరు తీయడంతో వెంటనే నందు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు నాన్న అని అనగా మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అయితే మమ్మల్ని నిలదీయు లేకపోతే నిలదీస్తున్న వారి నోరు మూయించు అంటారు పరంధామయ్య. అప్పుడు భాగ్య చట్టాల గురించి మాట్లాడగా చట్టాల గురించి మీకు తెలుసా అని అంటాడు సామ్రాట్.
అప్పుడు నందు మీకు ఇంటికి ఏ సంబంధం లేదు మౌనంగా ఉండండి అనవసరంగా లేనిపోని విషయాలు తల దూర్చొద్దు ఏ అర్హత లేదు అనగా వెంటనే పరంధామయ్య నీకంటే ఎక్కువ అర్హత ఉంది అని అంటాడు. అప్పుడు నందు,లాస్యలు తులసి సామ్రాట్ ల బంధం గురించి నోటికి వచ్చిన విధంగా వాగుతూ ఉంటారు. అప్పుడు లాస్య నందు కూడా వత్తాసు పలుకుతాడు.