Dhanteras 2022 : దీపావళి పండుగ వచ్చేస్తోంది. అంతకంటే ముందుగా అక్టోబర్ 23న ధన త్రయోదశి (Dhanteras 2022) రానుంది. ఈ ధన త్రయోదశి (ధన్‌తేరస్)కు చాలా ప్రత్యేకత ఉందని అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీ దేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. బంగారం, వెండి నగలను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ధన్‌తేరస్ రోజున బంగారం కొనుగోలు చేస్తే.. లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని హిందువులు నమ్ముతారు.
అక్టోబరు 23న ధన్‌తేరస్ రోజున మరో ప్రత్యేకత ఉంది.. అదే రోజున శనిదేవుడు మకరరాశిలో నేరుగా సంచరించనున్నాడు. తిరోగమనంలో నుంచి శని.. ధన్‌తేరస్ నుంచి ముందుకు కదులుతాడు. శని తిరోగమనంతో మూడు రాశుల వారికి మాత్రం అంతులేని అదృష్టం వచ్చి తలుపు తడుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో భారీగా ధనలాభం పొందుతారు. ఇంతకీ ఏ రాశుల వారికి లక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి :
ఈ రాశివారికి శని మార్గితో బాధలన్నీ తొలిగిపోతాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎంతోకాలంగా రోగాలతో బాధపడుతున్నవారికి అంత నయమై ఆరోగ్యంగా ఉంటారు. మీ శత్రువులు ఎవరైనా ఉంటే వారంతా బలహీనంగా మారి మీకు దాసోహమంటారు. ఇక ఇంట్లో ఏమైనా గొడవలు ఉంటే అన్ని చక్కబడతాయి. మీకు కొత్తవారితో స్నేహాలు ఏర్పడతాయి. కొత్త సంబంధాలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ లైఫ్‌లో మిమ్మల్ని వేధించే ఒత్తిళ్లన్నీ మటుమాయమైపోతాయి. విద్యార్థులకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.
Dhanteras 2022 : ధన త్రయోదశి నుంచి అదృష్టమే.. అదృష్టం.. డబ్బే డబ్బు..
కర్కాటక రాశి : ఈ రాశి వారిలో భార్యాభర్తల మధ్య సక్యత పెరిగి ఆనందంగా ఉంటారు. ఈ రాశివారి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఉద్యోగ, వ్యాపారాలలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ రాశివారికి ఇంట ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలోని కలతలన్నీ సమసిపోతాయి. మీరు ఉద్యోగం చేస్తున్నట్టుయితే మీ వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులు వంటి విషయాల్లో మీదే విజయం అవుతుంది.
వృషభం :
ఈ రాశివారికి ధన్‌తేరస్ రోజు నుంచి అదృష్టంగా బలంగా పెరుగుతుంది. శని సంచారం అనేక ఆనందాలను, శుభ ఫలితాలను అందిస్తాడు. మీరు ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు. ఇంట్లో ఆనందంగా గడుపుతారు. మీకు డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగాల్లో ప్రమోషన్, వ్యాపారంలో అధిక లాభం పొందుతారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గిపోతాయి.
Read Also : Gold prices today : మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?