Nargis fakhri : ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేస్కోవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చేస్కోవాలి అనుకునే వాళ్లు మాత్రం మంచి సెటిల్ట్ వాళ్లని చూసి చేసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. పెళ్లి చేస్కొని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

తనకు పెళ్లి వద్దు, పెటాకలు వద్దని చెప్తూనే ప్రేమ మాత్రం కావాలని అంట్ోంది. అయితే ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈహీరోయిన్ ఎరు ఆమె చేసిన కామెంట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అమెరికన్ హాట్ బ్యూటీ ఫక్రి తెలుగు జనాలకు కూడా సుపరిచితురాలే.
పలు సినిమాలో తనదైన్ హాట్ అందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేయడంలో ఈమెను మించిన వాళ్లు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన డేటింగ్ లైఫ్ గురించి పర్సనల్ కేర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

తన జీవితంలో ఎంతో మందిని కలిసాను.. చాలా మందితో డేటింగ్ చేశాను.. అయితే అవేవి నాకు మంచి ఫీల్ ని ఇవ్వలేకపోయాయి. నిజమైన ప్రేమను అందుకోలేకపోయాను. నాకు ఈ పెళ్లి గిళ్లీ వద్దు. నిజమైన ప్రేమ మాత్రమే కావాలంటూ చెప్పుకొచ్చింది. అలాగే అలాంటి అభ్బాయి ఉంటే నేను రెడీ అంటూ ప్రకటించేసింది. నిజమైన ప్రేమ దొరక్క ఒంటరిగానే ఉంటున్నానని.. నిజమైన ప్రేమను ఆస్వాదించాలని ఉందంటూ బోల్డ్ స్టేట్ మెంట్ పాస్ చేసింది.