Vishnu priya: బుల్లి తెరపై తన నటనతో తన అందంతో చాలా మందిని ఆకట్టుకుంటుంది విష్ణు ప్రియ. సీరియల్లు చూసే వారికి విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ప్రతి కుటుంబానికి దగ్గరైంది విష్ణు ప్రియ. ఇద్దరు అమ్మాయిలు, కుంకుమ పువ్వు, నువ్వే కావాలి తదితర సీరియల్స్ లో నటించింది ఈ భామ. ఈ అమ్మడి టాలెంట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే విష్ణు ప్రియ మల్టీ టాలెంటెడ్. సీరియల్స్ లో తన నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అదే సమయంలో ఆమె స్టైల్ ఇంకా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
విష్ణు ప్రియ కనిపించిన ప్రతి సీరియల్ లోనూ తను చాలా అందంగా కనిపిస్తుంది. మెయిన్ క్యారెక్టర్ కంటే తనే హైలెట్ గా నిలుస్తుంది. దానికి కారణం.. ఆమె స్టైలే అని చెప్పాలి. చాలా అందంగా ఉండే విష్ణు ప్రియ.. స్టైల్ విషయంలో ఎప్పుడూ తగ్గదు. అయితే.. తను ధరించే దుస్తులు తానే స్వయంగా డిజైన్ చేసుకుంటుంది. కలర్ కాంబినేషన్ పక్కాగా ఉండేలా చూసుకుంటుంది. తనకు తానే మేకప్ వేసుకుంటుంది విష్ణు ప్రియ.
అయితే ఈ రోజు విష్ణు ప్రియ బర్త్ డే. తన పుట్టిన రోజుకు ఆమె భర్త సీరియల్ నటుడు అయిన సిద్ధార్థ్ వర్మ ఏమిచ్చాడో తెలుసా. ఏమిచ్చాడో విష్ణు ప్రియనే స్వయంగా చెప్పింది. ఓ బంగారు ఆభరణాల దుకాణానికి వెళ్లి తనకు నచ్చిన గాజులు, నెక్లెస్, రింగ్స్ తీసుకుంది. వాటిని తన బర్త్ డేకు తన భర్త కొనిచ్చాడని యూట్యూబ్ వీడియోలో వెల్లడించింది.