Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

ViVO Smart Phone: కొత్తగా మార్కెట్లోకి విడుదలైన సైలెంట్ గా ViVO Y35 స్మార్ట్ ఫోన్.. ధర ఎంత అంటే?

ViVO Smart Phone: సాధారణంగా మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తుందంటే ముందుగానే ఆ ఫోన్ గురించి పెద్ద ఎత్తున ప్రకటన చేసిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేస్తారు. అయి

By Ramesh Babu

Published on: September 2, 2022 6:17 PM

Updated on: September 2, 2022 6:17 PM

---Advertisement---

ViVO Smart Phone: సాధారణంగా మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ వస్తుందంటే ముందుగానే ఆ ఫోన్ గురించి పెద్ద ఎత్తున ప్రకటన చేసిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేస్తారు. అయితే తాజాగా వివో కంపెనీకి చెందిన ViVO Y35 స్మార్ట్ ఫోన్ ని చాలా సైలెంట్ గా మార్కెట్లోకి విడుదల చేసింది. అంతేకాదు, ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో విడుదల చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ విధంగా మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంది, ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత అనే విషయానికి వస్తే..

వివో వై35 స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంది.6.58- ఇంచ్ FHD+రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేని కలిగివుంది.EIS సపోర్ట్ కలిగిన 50 ఎంపి ప్రాధమిక కెమెరా, 2 ఎంపి బొకే సెన్సార్ మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 44 W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది.

Advertisement

vivo smartphone

ViVO Smart Phone:

ఇక ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్లోకి లాంచ్ అయ్యి రెండు రకాల కలర్స్ అందుబాటులో ఉంది. అగేట్ బ్లాక్ మరియు డాన్ గోల్డ్ అనే రెండు కలర్ల ఆప్షన్లు ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి ఉంది. అధునాతన ఫీచర్లు కలిగినటువంటి ఈ ఫోన్ ధర కూడా తక్కువే అని చెప్పాలి. ఈ ఫోన్ మార్కెట్లో మనకు రూ.18,499లకే అని వివో స్టోర్స్ రిటైల్ అవుట్ లెట్స్ లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ఎస్బిఐ, ఐసిఐసిఐ, కొటక్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసే వారికి వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఏది ఏమైనా ఎంతో సైలెంట్ గా ఎన్నో అధునాతన ఫీచర్లు కలిగినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంతో మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి.

, , , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :